యాదాద్రి భువనగిరి, నవంబరు04/ట్రైనెట్ న్యూస్:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం బుధవారం రోజు మండల కేంద్రంలో వీబీ-జీ రామ్ జీ కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల మేట్స్‌కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో కూలీలందరికీ నిరంతరంగా ఉపాధి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కూలీలకు రోజుకు రూ.308 వేతనం అందేలా పనులు నిర్వహించాలని, ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజుల పని కల్పించేలా కృషి చేయాలని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకుంటూ పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ బి రమేష్,ఇంచార్జి ఈసీ ఏ మల్లేష్, టీఏలు డి శ్రీశైలం,డి నిర్మలతో పాటు వివిధ గ్రామాల మేట్స్ పాల్గొన్నారు.






