యాదాద్రి భువనగిరి,నవంబరు04/ట్రైనెట్ న్యూస్:
తెలంగాణ గ్రామీణ బ్యాంకు భువనగిరి శాఖ నూతన భవనాన్ని బుధవారం బ్యాంకు చైర్మన్ కె. ప్రతాప్‌రెడ్డి,చీఫ్ జనరల్ మేనేజర్ అతుల్ శ్రీవాస్తవ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ ఎం. ఉదయ్, చీఫ్ మేనేజర్ పి. రాంచంద్రారెడ్డి, సీనియర్ మేనేజర్ ఎం. మురళీకృష్ణ, బ్రాంచ్ మేనేజర్ ఎన్. అన్వర్ లాల్ , హబ్ మేనేజర్ జి. నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో బ్యాంకుకు 48 శాఖలు ఉన్నాయని, ఈ నెలలో డ్వాక్రా సంఘాలకు రూ.30 కోట్లు, చేనేత కార్మికులకు రూ.2 కోట్లు, డెయిరీ రంగ రైతులకు రూ.2 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. రుణమేళాలో భాగంగా 20 మంది లబ్ధిదారులకు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు, వాహనాల కొనుగోలుకు రుణాలు మంజూరు చేశారు.రైతులు రుణాలను సకాలంలో చెల్లించాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జనరల్ మేనేజర్ అతుల్ శ్రీవాస్తవ సూచించారు. విజయ డెయిరీ భాగస్వామ్యంతో రైతులు రుణాలు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చైర్మన్ కె. ప్రతాప్‌రెడ్డి కోరారు.
నూతన భవనం ద్వారా ఖాతాదారులకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.





