Monday9 November 2026Hyderabad

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
HYD 22K₹1,32,388/10g+0.72%
Languages

Latest News

తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన భవనం ప్రారంభం రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి: చైర్మన్ కె. ప్రతాప్‌రెడ్డి

nagendra5 November 2026, 4:14 AM1 viewstrinetnews.com
తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన భవనం ప్రారంభం రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి: చైర్మన్ కె. ప్రతాప్‌రెడ్డి

Share this story

Share link keeps your language (?lang=)

యాదాద్రి భువనగిరి,నవంబరు04/ట్రైనెట్ న్యూస్:

తెలంగాణ గ్రామీణ బ్యాంకు భువనగిరి శాఖ నూతన భవనాన్ని బుధవారం బ్యాంకు చైర్మన్ కె. ప్రతాప్‌రెడ్డి,చీఫ్ జనరల్ మేనేజర్ అతుల్ శ్రీవాస్తవ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ ఎం. ఉదయ్, చీఫ్ మేనేజర్ పి. రాంచంద్రారెడ్డి, సీనియర్ మేనేజర్ ఎం. మురళీకృష్ణ, బ్రాంచ్ మేనేజర్ ఎన్. అన్వర్ లాల్ , హబ్ మేనేజర్ జి. నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో బ్యాంకుకు 48 శాఖలు ఉన్నాయని, ఈ నెలలో డ్వాక్రా సంఘాలకు రూ.30 కోట్లు, చేనేత కార్మికులకు రూ.2 కోట్లు, డెయిరీ రంగ రైతులకు రూ.2 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. రుణమేళాలో భాగంగా 20 మంది లబ్ధిదారులకు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు, వాహనాల కొనుగోలుకు రుణాలు మంజూరు చేశారు.రైతులు రుణాలను సకాలంలో చెల్లించాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జనరల్ మేనేజర్ అతుల్ శ్రీవాస్తవ సూచించారు. విజయ డెయిరీ భాగస్వామ్యంతో రైతులు రుణాలు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చైర్మన్ కె. ప్రతాప్‌రెడ్డి కోరారు.

నూతన భవనం ద్వారా ఖాతాదారులకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య