సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
22K₹1,32,388/10g+0.72%
భాషలు

తాజా వార్తలు

యాదవుల ఆత్మగౌరవానికి పెద్దపీట.. సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా: సీఎం రేవంత్ రెడ్డి

nagendra5 November 2026, 4:13 AM0 చూసులుtrinetnews.com
యాదవుల ఆత్మగౌరవానికి పెద్దపీట.. సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా: సీఎం రేవంత్ రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 4:

యాదవుల ఆత్మగౌరవం తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సదర్ సమ్మేళనం కేవలం యాదవులకే పరిమితమైన వేడుక కాదని, తెలంగాణ సమాజం గర్వించదగిన ఆత్మగౌరవ వేడుక అని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో కీలకమని సీఎం కొనియాడారు. ప్రస్తుతం గోల్కొండ కోటగా పిలుస్తున్న ప్రాంతం ఒకప్పుడు గొల్లంకొండగా ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. యాదవ సోదరుల సహకారం, ఆదరణతోనే హైదరాబాద్ నగరం ఇంతగా అభివృద్ధి చెందిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రజలను యాదవులు ఆదరించి అక్కున చేర్చుకున్నారని ప్రశంసించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలనే ఆలోచన చేయలేదని, తమ ప్రభుత్వం యాదవుల ఆకాంక్షలను గౌరవిస్తూ సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. సమ్మేళనం నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు.

తెలంగాణలో తమ ప్రభుత్వం కులగణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం అన్నారు. తెలంగాణ మోడల్‌ను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా కులగణన చేపట్టామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో యాదవులకు సముచిత రాజకీయ, సామాజిక ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్‌కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామని, ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట ఆలయ బోర్డు సభ్యురాలిగా నియమించామని వివరించారు. యాదగిరిగుట్ట గోశాలలో గోవుల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో యాదవులకు దక్కాల్సిన వాటా వారికి దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. యాదవ సోదరుల ఆత్మగౌరవానికి ఎక్కడా భంగం కలగకుండా చూసుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

తెలంగాణను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మూసీ అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాలకు యాదవ సోదరులు సహకరించాలని ఆయన కోరారు. యాదవుల సంక్షేమం, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాధాన్యతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →