న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 04:
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ నూతన అధికారిక వెబ్సైట్ను కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ బుధవారం న్యూఢిల్లీలోని పంచశీల్ భవన్లో ప్రారంభించారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్శి అవినాష్ జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు సమాచారాన్ని సులభంగా అందించడంతో పాటు డిజిటల్ సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో వెబ్సైట్ను ఆధునీకరించారు. భారత ప్రభుత్వ తాజా ప్రమాణాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన ఈ వేదికలో పారదర్శకత, అందుబాటు, వినియోగ సౌలభ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు.
వినియోగదారుల సమాచార భద్రత కోసం మెరుగైన డేటా రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. విస్తృత స్థాయిలో ప్రజలకు సమాచారం చేరువయ్యేలా బహుభాషా సదుపాయాన్ని కల్పించారు. అవసరమైన వివరాలను వేగంగా పొందేందుకు సెర్చ్ వ్యవస్థను మెరుగుపరిచారు.
మంత్రిత్వ శాఖ విధానాలు, పథకాలు, కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు, పరిశ్రమల ప్రతినిధులు ఈ వెబ్సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ప్రజల అవసరాలకు స్పందించే, సమ్మిళిత డిజిటల్ సేవల విస్తరణలో ఈ నూతన వేదిక కీలకంగా నిలవనుంది.





