Monday9 November 2026Hyderabad

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
HYD 22K₹1,32,388/10g+0.72%
Languages

Latest News

ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ నూతన వెబ్‌సైట్‌ ప్రారంభం ప్రజలకు సులభంగా సమాచారం అందించడమే లక్ష్యం

nagendra5 November 2026, 4:09 AM0 viewstrinetnews.com
ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ నూతన వెబ్‌సైట్‌ ప్రారంభం ప్రజలకు సులభంగా సమాచారం అందించడమే లక్ష్యం

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 04:

కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ నూతన అధికారిక వెబ్‌సైట్‌ను కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ బుధవారం న్యూఢిల్లీలోని పంచశీల్‌ భవన్‌లో ప్రారంభించారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్శి అవినాష్‌ జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు సమాచారాన్ని సులభంగా అందించడంతో పాటు డిజిటల్‌ సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో వెబ్‌సైట్‌ను ఆధునీకరించారు. భారత ప్రభుత్వ తాజా ప్రమాణాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన ఈ వేదికలో పారదర్శకత, అందుబాటు, వినియోగ సౌలభ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు.

వినియోగదారుల సమాచార భద్రత కోసం మెరుగైన డేటా రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. విస్తృత స్థాయిలో ప్రజలకు సమాచారం చేరువయ్యేలా బహుభాషా సదుపాయాన్ని కల్పించారు. అవసరమైన వివరాలను వేగంగా పొందేందుకు సెర్చ్‌ వ్యవస్థను మెరుగుపరిచారు.

మంత్రిత్వ శాఖ విధానాలు, పథకాలు, కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు, పరిశ్రమల ప్రతినిధులు ఈ వెబ్‌సైట్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ప్రజల అవసరాలకు స్పందించే, సమ్మిళిత డిజిటల్‌ సేవల విస్తరణలో ఈ నూతన వేదిక కీలకంగా నిలవనుంది.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య