సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
22K₹1,32,388/10g+0.72%
భాషలు

తాజా వార్తలు

భారత్‌–పోలండ్‌ వాణిజ్య బంధం బలోపేతానికి చర్యలు ఏఐ, సెమీకండక్టర్లు, కీలక ఖనిజ రంగాల్లో సహకారంపై జితిన్‌ ప్రసాద చర్చలు

nagendra5 November 2026, 4:08 AM0 చూసులుtrinetnews.com
భారత్‌–పోలండ్‌ వాణిజ్య బంధం బలోపేతానికి చర్యలు ఏఐ, సెమీకండక్టర్లు, కీలక ఖనిజ రంగాల్లో సహకారంపై జితిన్‌ ప్రసాద చర్చలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 04:

భారత్‌–పోలండ్‌ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని విస్తరించేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖల సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద నవంబర్‌ 2, 3 తేదీల్లో పోలండ్‌లో పర్యటించారు. ఆయన వెంట 12 భారతీయ కంపెనీల ప్రతినిధులతో కూడిన వ్యాపార బృందం పాల్గొంది.

పర్యటనలో పోలండ్‌ ఉప ప్రధానమంత్రి, డిజిటల్‌ వ్యవహారాల మంత్రి క్రిష్టోఫ్‌ గావ్‌కోవ్‌స్కీతో జితిన్‌ ప్రసాద సమావేశమయ్యారు. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, సైబర్‌ భద్రత రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు.

పోలండ్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఇగ్నసీ నెమ్‌చిట్స్కీతో జరిగిన సమావేశంలో భారత్‌–యూరోపియన్‌ యూనియన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను ప్రస్తావించారు. వ్యవసాయ సాంకేతికత, ఆహార శుద్ధి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని, చిన్న, మధ్యతరహా సంస్థలకు మరిన్ని వ్యాపార అవకాశాలు కల్పించాలని సూచించారు.

ఆర్థికాభివృద్ధి, సాంకేతిక శాఖ ఉప మంత్రి మిఖాల్‌ బరనోవ్‌స్కీతో కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లు, అంకుర సంస్థల భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమంలో పెట్టుబడి అవకాశాలను వివరించిన జితిన్‌ ప్రసాద.. సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో ఉమ్మడి అభివృద్ధి, ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

నవంబర్‌ 3న వార్సాలోని పోలిష్‌ నేషనల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో నిర్వహించిన భారత్‌–పోలండ్‌ బిజినెస్‌ ఫోరమ్‌లో మంత్రి ప్రారంభోపన్యాసం చేశారు. ఇరు దేశాల కంపెనీలు కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని, వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భారత్‌–ఈయూ వాణిజ్య ఒప్పందంతో విస్తరించే మార్కెట్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పోలండ్‌లోని భారతీయ వ్యాపారవేత్తలతోనూ మంత్రి సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వారు చేస్తున్న కృషిని అభినందించారు. భారత్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న పోలిష్‌ పెట్టుబడిదారులతో చర్చించారు. ట్రాన్సిషన్‌ టెక్నాలజీస్‌, డబ్ల్యూబీ ఎలక్ట్రానిక్స్‌ సంస్థలను సందర్శించారు. పటిష్ఠమైన అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల నిర్మాణానికి పోలండ్‌తో కలిసి పనిచేయాలన్న భారత్‌ నిబద్ధతను ఈ పర్యటన చాటిచెప్పింది.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య