Monday9 November 2026Hyderabad

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
HYD 22K₹1,32,388/10g+0.72%
Languages

Latest News

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, రూ.కోటి ప్రమాద బీమా అందజేత

nagendra5 November 2026, 4:01 AM0 viewstrinetnews.com
కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, రూ.కోటి ప్రమాద బీమా అందజేత

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 4: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతితో ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అన్ని విధాలుగా అండగా ఉంటాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ప్రవళిక పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం ప్రవళిక తల్లిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అదేవిధంగా ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కలిపి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయడంతో పాటు, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం మేరకు బ్యాంకు ద్వారా రూ.కోటి ప్రమాద బీమా పరిహారం కుటుంబానికి అందుతుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ యాజమాన్యం స్పందించి ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుందని, అయినప్పటికీ ప్రవళికను కాపాడుకోలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

ఈ ఘటనకు కారణమైన వ్యక్తిపై తొలుత హత్యాయత్నం కేసు ఉండగా, ప్రవళిక మృతితో హత్య కేసు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు కార్మికుల సంక్షేమం, భద్రతకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ఎవరైనా ప్రయాణికుల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సిబ్బందిపై దాడులకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న ఆర్టీసీ సంస్థలో సిబ్బంది కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రయాణికులే దేవుళ్లుగా భావించి వారికి మెరుగైన సేవలు అందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు. అదే సమయంలో కార్మికుల భద్రతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకుందని, పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రవళిక కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, ఆర్టీసీ అన్ని విధాలా సహకరిస్తాయని, అయితే ఆ కుటుంబం కోల్పోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ఏవైనా సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య