Monday9 November 2026Hyderabad

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
HYD 22K₹1,32,388/10g+0.72%
Languages

Latest News

రాష్ట్రవ్యాప్తంగా మా ఇందిర‌మ్మ ఇంట్లో దీపావ‌ళి వేడుక‌లు ల‌బ్దిదారులు ,అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొనాల‌ని పిలుపు

nagendra5 November 2026, 4:00 AM0 viewstrinetnews.com
రాష్ట్రవ్యాప్తంగా మా ఇందిర‌మ్మ ఇంట్లో దీపావ‌ళి వేడుక‌లు ల‌బ్దిదారులు ,అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొనాల‌ని పిలుపు

Share this story

Share link keeps your language (?lang=)

రాష్ట్రంలో 2,21,500 ఇందిర‌మ్మ ఇళ్ల గృహ‌ప్ర‌వేశాలు పూర్తి

వివిధ నిర్మాణ ద‌శ‌ల్లో 1.90 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు

4 కార్పొరేష‌న్ల‌లో హైద‌రాబాద్ త‌ర‌హా ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణం

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 04: రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిరుపేద‌ల కోసం నిర్మిస్తున్న ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కంలో ఇంత‌వ‌ర‌కు 2,21,500 ఇళ్ల‌లో గృహ‌ప్ర‌వేశాలు పూర్త‌య్యాయ‌ని ఈ దీపావ‌ళి రోజున ప్ర‌తి ఇందిర‌మ్మ ఇంటిలో దీపావ‌ళి వేడుక‌ల జ‌ర‌పాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆరోజున పేద‌ల ఇంట్లో వెలిగే ప్ర‌తిదీపం తెలంగాణ ప్ర‌జాప్ర‌భుత్వ సంక‌ల్పానికి ప్ర‌తీక కావాల‌న్నారు. బుధ‌వారం నాడు మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబుతో క‌లిసి మంత్రి పొంగులేటి మాట్లాడారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో ఈ ప్ర‌జా ప్ర‌భుత్వం ఎన్ని ఆర్ధిక అవ‌రోధాలున్నా పేద‌ల ఆత్మ‌గౌర‌వానికి చిహ్న‌మైన ఇందిర‌మ్మ ఇళ్ల‌ను నిర్మించేందుకు నిర్ణ‌యించింద‌న్నారు. భ‌ద్ర‌త, భ‌రోసాతో పాటు ఇందిర‌మ్మ ఇళ్లు ఇవ్వాల‌న్న సంక‌ల్పంతో తొలివిడ‌త 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేయ‌గా ఇప్ప‌టికి 2,21,500 ఇళ్ల‌లో గృహ ప్ర‌వేశాలు పూర్త‌య్యాయ‌ని, మ‌రో 1.90 ల‌క్ష‌ల ఇళ్ళు వివిధ నిర్మాణ‌ద‌శ‌ల్లో పూర్తికానున్నాయ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. గృహ ప్ర‌వేశాలు జ‌రుపుకున్న ఇళ్ల‌కు దీపావ‌ళి రోజున ప్ర‌జాప్ర‌తినిధులు, క‌లెక్ట‌ర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిర‌మ్మ ఇళ్ళ క‌మిటీ స‌భ్యులు, ఈ ప‌ధ‌కంతో మ‌మేక‌మైన అంద‌రూ ఆ ఇళ్లకు వెళ్లి వారి ఆనందాల్లో భాగ‌స్వాములు కావాల‌ని కోరారు. దీనికి సూచిక‌గా మా ఇందిర‌మ్మ ఇంట్లో దీపావ‌ళి వేడుక‌లు అనే పోస్ట‌ర్‌ను మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుతో క‌లిసి మంత్రి పొంగులేటి ఆవిష్క‌రించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తో స‌హా రాష్ట్ర మంత్రి వ‌ర్గం ఈ కార్య‌క్ర‌మాన్ని దిగ్విజ‌యంగా నిర్వ‌హించాల‌ని కోరుతోంద‌ని మంత్రి పొంగులేటి వెల్ల‌డించారు. అనంత‌రం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తొలి విడ‌త‌గా 4.50 ల‌క్ష‌ల ఇళ్లు, రెండో విడ‌త 2.50 ల‌క్ష‌ల ఇళ్ల‌తో పాటు హైద‌రాబాద్ క్యూర్ ఏరియా ప‌రిధిలో ల‌క్ష ఇళ్ల‌ను మంజూరు చేశామ‌ని చెబుతూ హైద‌రాబాద్ త‌ర‌హాలోనే రాష్ట్రంలోని నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ కార్పొరేష‌న్‌ల‌లో కూడా ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణం చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు. జి+5 ప‌ద్ద‌తిలో నిర్మించ‌నున్న ఈ ట‌వ‌ర్స్ నిర్మాణానికి సంబంధించి దీపావ‌ళి లోగా నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో నిర్మిస్తున్న ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నుంచి వ‌చ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామ‌ని మంత్రి గారు పున‌రుద్ఘాటించారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్ల‌తో చేప‌డుతున్న ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఎట్టిప‌రిస్ధితుల్లోనూ ఆపేదిలేద‌ని స్ప‌ష్టం చేస్తూ ఇప్ప‌టికే ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల బ్యాంకు ఖాతాల‌కు ప్ర‌తి సోమ‌వారం నేరుగా హైద‌రాబాద్ నుంచి అవినీతి ర‌హితంగా నిధుల‌ను జ‌మ‌చేస్తున్నామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలోని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాలేగాక మారుమూల ప్రాంతాలు, తండాల‌లో కూడా ఈ ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం జ‌రుగుతోంద‌ని ఫ‌లితంగా పేద‌వారి సొంతింటిక‌ల సాకార‌మ‌వుతోంద‌ని మంత్రి పొంగులేటి అన్నారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

Read more →