సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,076+5.41%
NIFTY24,997+4.98%
22K₹1,32,520/10g+0.82%
భాషలు

తాజా వార్తలు

క్షేత్రస్థాయి పాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం పెండింగ్‌ సమస్యల పరిష్కారం.. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ

nagendra4 November 2026, 5:39 AM1 చూసులుtrinetnews.com
క్షేత్రస్థాయి పాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం పెండింగ్‌ సమస్యల పరిష్కారం.. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 3:

ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడంతోపాటు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడం, క్షేత్రస్థాయి పాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

రెవెన్యూ, హౌసింగ్, భూ సర్వే శాఖలకు సంబంధించిన అంశాలకు క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి సమన్వయంతో చర్యలు తీసుకునే ఉద్దేశంతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో సమీక్షలు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం నాడు మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని షామీర్‌పేటలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇన్‌చార్జి మంత్రులు పాల్గొననున్నారు. రెవెన్యూ సమస్యలు, గృహ నిర్మాణ పథకాల అమలు, భూ సర్వే పురోగతితోపాటు ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్షించనున్నారు.

గత ఏప్రిల్‌, మే నెలల్లో రాజధాని వేదికగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమావేశాల్లో ఉమ్మడి జిల్లాల వారీగా శాఖల పనితీరు, సమస్యల పరిష్కారంపై చర్చించినట్లు మంత్రి తెలిపారు. ఆయా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు, క్షేత్రస్థాయిలో సాధించిన పురోగతి, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలపై ప్రస్తుత సమీక్షల్లో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

సమీక్షల లక్ష్యం సమస్యలను గుర్తించడమే కాదు.. వాటికి పరిష్కారం చూపడం. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా, శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతమయ్యేలా ఈ సమావేశాలు దోహదపడతాయని మంత్రి తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య