యాదాద్రి భువనగిరి, నవంబరు03/ట్రైనెట్ న్యూస్:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు మహిళల భద్రత, మహిళా హక్కులు, ఈవ్ టీజింగ్, వేధింపులు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. షీ టీమ్స్ అందిస్తున్న సేవలు, ఫిర్యాదు చేసే విధానం, అత్యవసర సమయంలో పోలీసుల సహాయం పొందే మార్గాల గురించి వివరించారు.
Dial 112 & She teams 8712665338 మహిళల భద్రతకు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, విద్యార్థినులు అప్రమత్తంగా ఉంటూ తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.





