Monday9 November 2026Hyderabad

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
HYD 22K₹1,32,388/10g+0.72%
Languages

Latest News

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ప్రచార కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

nagendra4 November 2026, 5:36 AM1 viewstrinetnews.com
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ప్రచార కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 03:

డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నేడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సమ్మిట్‌కు విస్తృత ప్రచారం కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న ప్రచార వ్యూహాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపిన అంశాలపై ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.

హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో ఆకర్షణీయమైన హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. సమ్మిట్‌పై ప్రజల్లో అవగాహన, భాగస్వామ్యాన్ని పెంపొందించేలా 10K రన్, క్రీడా పోటీలు, ఇతర ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.

సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఆహ్వానాలు అందుకున్న ప్రతినిధులు, ప్రముఖులు, ఇతర ముఖ్య అతిథుల వివరాలను అధికారులు ప్రధాన కార్యదర్శికి వివరించారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రచార కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, అనుకూల పారిశ్రామిక వాతావరణం, మౌలిక సదుపాయాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమర్థవంతంగా చాటిచెప్పాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్ రెడ్డి, డిజిటల్ మీడియా డైరెక్టర్ కర్రి శ్రీరామ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య