యాదాద్రి భువనగిరి, నవంబరు03/ట్రైనెట్ న్యూస్:
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని ధర్మకాంటాలపై సంబంధిత అధికారులు నిరంతర నిఘా ఉంచి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గతంలో రెడ్‌హ్యాండెడ్‌గా అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడిన ధర్మకాంటాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు కొనసాగిస్తే వాటిని రద్దు చేయాలని కోరారు. తూకాల్లో మోసాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, నిర్లక్ష్యం వహించే అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.రైతులకు అన్యాయం జరగకుండా అధికారులు వెంటనే స్పందించి పారదర్శకమైన తూకం విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు జితేందర్ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి కొంపల్లి గణేష్, మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షులు గుదే మధుసూదన్ యాదవ్, అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షులు నానుబోతు సైదులు, ఇటుకల పాడురంగాచారి తదితరులు పాల్గొన్నారు.





