Monday9 November 2026Hyderabad

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
HYD 22K₹1,32,388/10g+0.72%
Languages

Latest News

ధర్మకాంటాలపై అధికారులు తక్షణమే తనిఖీలు చేపట్టాలి- బీజేపీ నాయకుల డిమాండ్

nagendra4 November 2026, 5:34 AM1 viewstrinetnews.com
ధర్మకాంటాలపై అధికారులు తక్షణమే తనిఖీలు చేపట్టాలి- బీజేపీ నాయకుల డిమాండ్

Share this story

Share link keeps your language (?lang=)

  • యాదాద్రి భువనగిరి, నవంబరు03/ట్రైనెట్ న్యూస్:

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని ధర్మకాంటాలపై సంబంధిత అధికారులు నిరంతర నిఘా ఉంచి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గతంలో రెడ్‌హ్యాండెడ్‌గా అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడిన ధర్మకాంటాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు కొనసాగిస్తే వాటిని రద్దు చేయాలని కోరారు. తూకాల్లో మోసాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, నిర్లక్ష్యం వహించే అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.రైతులకు అన్యాయం జరగకుండా అధికారులు వెంటనే స్పందించి పారదర్శకమైన తూకం విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు జితేందర్ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి కొంపల్లి గణేష్, మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షులు గుదే మధుసూదన్ యాదవ్, అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షులు నానుబోతు సైదులు, ఇటుకల పాడురంగాచారి తదితరులు పాల్గొన్నారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య