యాదాద్రి భువనగిరి, నవంబరు03/ట్రైనెట్ న్యూస్:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రం లోని భవిత కేంద్రం నందు దివ్యాంగుల మండల స్థాయి క్రీడకారుల ఎంపికకు సంబంధించి క్రీడల్ని మండల విద్యాధికారి పి.వెంకట రామి రెడ్డి ప్రారంభించడం జరిగినది. ఇట్టి క్రీడలలో మండల స్థాయి క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుంది అని తెలిపారు.వీరికి ఈ నెల 6వ తేదీన జిల్లా స్థాయిలో దివ్యాంగుల క్రీడాకారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ. వెంకట్ రెడ్డి,యం డి మాక్సూద్ అలీ,ప్రధానోపాధ్యాయులు సిహెచ్.చిత్తరంజన్,ఐఈఆర్పీ సిహెచ్ బాలరాజు, ఉపాధ్యాయులు లలిత,శ్రీను, రాణి,తదితరులు పాల్గొన్నారు.





