సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,076+5.41%
NIFTY24,997+4.98%
22K₹1,32,520/10g+0.82%
భాషలు

తాజా వార్తలు

డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తే సైబర్ నేరాలకు అసలైన రక్షణ!

nagendra4 November 2026, 5:32 AM0 చూసులుtrinetnews.com
డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తే సైబర్ నేరాలకు అసలైన రక్షణ!

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

యాదాద్రి భువనగిరి, నవంబరు03/ట్రైనెట్ న్యూస్:

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సైబర్ నేరాల నివారణ, సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ఎవరితోనూ ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు,యూపీఐ పిన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతో పాటు ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలొ జిల్లా ఎస్పీతో పాటు ఎస్ఐలు నాగరాజు, అశోక్, వెంకటేష్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య