సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,076+5.41%
NIFTY24,997+4.98%
22K₹1,32,520/10g+0.82%
భాషలు

తాజా వార్తలు

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ పెండింగ్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని -రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

nagendra4 November 2026, 5:23 AM0 చూసులుtrinetnews.com
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ పెండింగ్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని -రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 03:

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ పెండింగ్‌ పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్‌‌ అండ్ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ మేరకు టిమ్స్ అల్వాల్, టిమ్స్ ఎల్‌బీ నగర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష చేశారు. సెక్రటేరియట్‌లో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో హాస్పిటల్‌లో ప్రతి ఫ్లోర్ ప్లాన్‌ను మంత్రి పరిశీలించారు. తొలుత అవుట్‌ పేషెంట్ వైద్య సేవలు ప్రారంభించనున్న నేపథ్యంలో, ఇందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ డెస్క్‌లు, ఓపీ కన్సల్టేషన్‌ రూమ్‌లు, ఫార్మసీ, డయాగ్నస్టిక్స్‌ తదితర సేవలకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ నెల 15వ తేదీ నాటికి అవుట్ పేషెంట్ సేవలకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. 6 ఆపరేషన్ థియేటర్లు సైతం సిద్ధమవుతాయని తెలిపారు. ఒక్కసారి పేషెంట్‌ హాస్పిటల్‌కు వచ్చాక, మరో హాస్పిటల్‌కు రిఫర్ చేసే ప్రసక్తే ఉండకూడదని, అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా హాస్పిటల్‌లో సౌకర్యాలు ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం నియమించిన డాక్టర్ల బృందం వరంగల్ హాస్పిటల్‌, అల్వాల్, కొత్తపేట టిమ్స్‌ హాస్పిటళ్లను రెగ్యులర్‌‌గా విజిట్ చేయాలని మంత్రి ఆదేశించారు. అల్వాల్ టిమ్స్‌ పనులు సైతం చివరి దశలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాలేషన్‌ జరుగుతోందని తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి ఎల్‌బీ నగర్ టిమ్స్ పనులు చివర దశకు వస్తాయని అధికారులు తెలిపారు. పనులన్నీ స్పీడప్ చేయాలని, వీలైనంత త్వరగా హాస్పిటళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య