సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
22K₹1,32,388/10g+0.72%
భాషలు

తాజా వార్తలు

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్రతో నిరంతర సంప్రదింపులు జరపాలి: -సీఎం రేవంత్ రెడ్డి

nagendra4 November 2026, 5:22 AM1 చూసులుtrinetnews.com
తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్రతో నిరంతర సంప్రదింపులు జరపాలి: -సీఎం రేవంత్ రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 3:

తుమ్మిడిహట్టి బ్యారేజ్ పైన మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ముంపునకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలు, ఇతర అంశాలకు సంబంధించిన పత్రాలను మహారాష్ట్రకు అందజేయాలని సీఎం స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మిడిహట్టి పైన అధికారులతో సమీక్ష జరిపారు. మహారాష్ట్రతో ఇటీవల జరిపిన చర్చలు, ఇతర అంశాలపైన అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్‌లో ఉంచుతామన్నారు. భూముల ముంపుపైన మహారాష్ట్ర ఎలాంటి సర్వే చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అధికారులకు కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు.

ఈ సమీక్షలో ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఇరిగేషన్ ఈఎన్‌సీ (జనరల్) రమేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య