Monday9 November 2026Hyderabad

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
HYD 22K₹1,32,388/10g+0.72%
Languages

Latest News

సింగరేణిలో గైర్హాజరు కారణంగా తొలగింపునకు గురైన వారి కేసుల పునఃపరిశీలనకు దరఖాస్తుల ఆహ్వానం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ

nagendra4 November 2026, 5:20 AM1 viewstrinetnews.com
సింగరేణిలో గైర్హాజరు కారణంగా తొలగింపునకు గురైన వారి కేసుల పునఃపరిశీలనకు దరఖాస్తుల ఆహ్వానం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ

Share this story

Share link keeps your language (?lang=)

  • సింగరేణి భవన్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 03 :

సింగరేణి సంస్థలో 2023 నుంచి 2025 మధ్య కాలంలో విధులకు గైర్హాజరు కారణంగా తొలగించబడిన మాజీ ఉద్యోగుల కేసులను పునఃపరిశీలించాలని యాజమాన్యం నిర్ణయించింది. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకునేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 01.01.2023 నుంచి 31.12.2025 మధ్య కాలంలో గైర్హాజరు కారణంగా తొలగించబడిన వారు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. 01.04.2026 నాటికి 46 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క కోల్ బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధులతో సమావేశం సందర్భంగా డిస్మిస్డ్ ఉద్యోగులకు తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని పలువురు ప్రజా ప్రతినిధులు కోరిన నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలించాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో 2023 నుంచి 2025 మధ్య కాలంలో గైర్హాజరు కారణంగా డిస్మిస్ అయిన ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది.

ఇవీ అర్హతలు....తొలగించబడిన కాలానికి ముందున్న గత 05 క్యాలెండర్ సంవత్సరాలలో ఏదైనా 2 సంవత్సరాలలో కనీసం 100 మస్టర్లు పూర్తి చేసి ఉండాలి. జనరల్ అసిస్టెంట్ ట్రైనీ (యూజీ ), కేటగిరీ-I పోస్టులో పునఃనియామకం కోసం వైద్యపరంగా ఫిట్‌గా ఉండాలి. అర్హత కలిగి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే డిస్మిస్డ్ ఉద్యోగులు తగిన ప్రొఫార్మాలో దరఖాస్తును పూర్తి చేసి, తాము చివరగా పనిచేసిన గని / డిపార్ట్‌మెంట్ అధిపతికి సమర్పించాలి. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 14.11.2026గా సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఏరియా జనరల్ మేనేజర్లు అర్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి, తదుపరి చర్యల నిమిత్తం నిర్ణీత తేదీలోగా సంబంధిత అధికారులకు పంపించాలని కోరింది. పూర్తి వివరాల కోసం సంబంధిత గనులు లేదా శాఖల అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య