సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
22K₹1,32,388/10g+0.72%
భాషలు

తాజా వార్తలు

కేంద్ర పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి కేంద్ర నిధులను పూర్తిస్థాయిలో రాబట్టేందుకు కృషి చేయాలి

nagendra4 November 2026, 5:17 AM1 చూసులుtrinetnews.com
కేంద్ర పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి కేంద్ర నిధులను పూర్తిస్థాయిలో రాబట్టేందుకు కృషి చేయాలి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

కేంద్ర ప్రాయోజిత పథకాల లక్ష్యాలు నెరవేరాలి.. ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు అందాలి

కేంద్ర శాఖలతో నిరంతర సమన్వయం చేసుకోవాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 3:

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై మరింత దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కేంద్ర పథకాల కింద కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు, ఆయా పథకాల ద్వారా ఆశించిన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర ప్రభుత్వ సెక్టార్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అమలు, నిధుల కేటాయింపులు, ఖర్చులు, పెండింగ్ బిల్లులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ‎ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి నిధులు పొందేందుకు ఉన్న అన్ని అవకాశాలను శాఖలవారీగా గుర్తించి, అవసరమైన ప్రతిపాదనలను సకాలంలో సమర్పించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల మార్గదర్శకాలను పరిశీలించి, అర్హతలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని, కేంద్ర శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నిధుల సాధనకు కృషి చేయాలని అధికారులకు దిశ నిర్ధేశం చేశారు.

కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి గరిష్ఠ స్థాయిలో నిధులు రాబట్టుకోవాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగం, పురోగతిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి.. కేంద్రం కేటాయించిన నిధులను సమర్థవంతంగా ఖర్చు చేయడంతో పాటు, వాటి ద్వారా ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 40 శాతం నిధులను సమకూరుస్తున్నందున, నిధుల ఖర్చుపైనే కాకుండా వాటి ద్వారా సాధిస్తున్న ఫలితాలు, ప్రజలకు కలుగుతున్న

ప్రయోజనాలపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పనిచేస్తున్న లైజన్ అధికారుల సేవలను అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి నిధుల విడుదల సాధించడంతో పాటు, పెండింగ్ అంశాల పరిష్కారానికి వారితో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వివిధ కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో ప్రస్తావించిన అంశాలపై కూడా సకాలంలో తదుపరి చర్యలు తీసుకుంటూ, వాటి పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్రం అందించే ప్రత్యేక సహాయ పథకం (స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) వంటి కేంద్ర కార్యక్రమాలను రాష్ట్రం గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. పథకాల అమలుకు ఆటంకంగా ఉన్న పెండింగ్ సమస్యలు, సాంకేతికపరమైన ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించి ముందుకు తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా నీటిపారుదల, పట్టణాభివృద్ధి, రవాణా, వ్యవసాయం, వైద్య ఆరోగ్య శాఖలు కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. తద్వారా ఆయా పథకాల కొనసాగింపునకు, అదనపు నిధుల సాధనకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులను సకాలంలో విడుదల చేస్తున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను కూడా పరిష్కరించామని చెప్పారు. అన్ని బిల్లులను క్రమశిక్షణతో క్లియర్ చేస్తున్నామని వివరించారు. వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల ప్రస్తుత పరిస్థితి, పురోగతి, నిధుల వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →