సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,049+5.37%
NIFTY25,004+5.01%
22K₹1,32,462/10g+0.81%
భాషలు

తాజా వార్తలు

వచ్చే బోనాల నాటికి ఇందిరమ్మ టవర్స్ పూర్తి ఇందిరమ్మ ఇండ్లకు మరిన్ని భూములను గుర్తిస్తున్నాం హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్

nagendra4 November 2026, 5:16 AM2 చూసులుtrinetnews.com
వచ్చే బోనాల నాటికి ఇందిరమ్మ టవర్స్ పూర్తి ఇందిరమ్మ ఇండ్లకు మరిన్ని భూములను గుర్తిస్తున్నాం హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఈ-లాటరీ ద్వారా నాలుగు నియోజకవర్గాల్లో 1920 ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక*

14 నియోజకవర్గాల్లో ఖాళీల భర్తీకి నేడు (బుధవారం) మరోసారి లాటరీ

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 3 :

హైదరాబాద్ లో సొంతంగా ఇండ్లు నిర్మించుకోడానికి భూములు కలిగి ఉండి అర్హులైన వారికి కూడా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రకటించారు. పేదల సొంత ఇంటికలను నిజం చేయడానికి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 5500 ఇండ్లను మంజూరు చేసిందని, అయితే హైదరాబాద్ వంటి మహానగరంలో స్థలాల లభ్యత తక్కువగా ఉన్నందున, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను పేదల నివాసాల కోసం వినియోగిస్తూ ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు.

గోషామహల్, ముషీరాబాద్, ఎల్.బి.నగర్, చంద్రాయణ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కేటాయింపు లాటరీని మంగళవారం నాడు శాసనభ్యులు రాజాసింగ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఈ-లాటరీ విధానంలో ఈ నియోజకవర్గాల్లో నిర్మించనున్న 1920 ఇండ్లకు లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నేడు లాటరీ తీసిన ప్రాంతాల్లో ఇండ్లనిర్మాణ పనులకు త్వరలోనే భూమి పూజ నిర్వహిస్తామన్నారు. పేద ప్రజల సొంత ఇంటి కలను నిజం చేసే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఆర్టీసీ భూములను కూడా ఇచ్చామని అలాగే పోలీసు శాఖ కు చెందిన భూములను సైతం వినియోగిస్తున్నామన్నారు. మొత్తం లక్ష ఇండ్ల నిర్మాణాలను చేపట్టేందుకు అనువైన భూములన్నిటినీ కూడా సేకరిస్తున్నామని ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వచ్చే బోనాల నాటికల్లా గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలో నివసిస్తున్న పేదలకు ఆ నియోజకవర్గంలోనే సొంత ఇంటి వసతి కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పం చాలా మంచిదన్నారు. నియోజకవర్గంలో ఇంకా అనేక చోట్ల గృహనిర్మాణాలకు అనువైన భూములను గుర్తిస్తున్నామని ఉన్నాయని వాటిలో కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ విపి గౌతం మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికి సొంత ఇంటి వసతిని కల్పించేంతవరకు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణాలను నిరంతరం చేపడతామని అన్నారు. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ ఇండ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులను కూడా భాగస్వామ్యులను చేసి, వారి పర్యవేక్షణలో నిర్మాణపు పనులు పూర్తి కావాలన్న ఉద్దేశ్యోంతోనే నామమాత్రంగా ఆరు లక్షల రూపాయల ధరను నిర్ధారించామన్నారు. బహిరంగ మార్కెట్ లో 40-50 లక్షల విలువ చేసే ఇంటిని నామమాత్రపు ధరకే అందించడమే కాకుండా, రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేయాలని నిర్ణయించామన్నారు. ఇండ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఈ-లాటరీ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. ఈ లాటరీ లో ఎంపికైన వారికి వెనువెంటనే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం చేరే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు.

నేడు (బుధవారం) మాప్ అప్ లాటరీ*

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లో ఇండ్ల కోసం పైలట్ ప్రాజెక్టు లో భాగంగా ఇప్పటికే లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు పూర్తి అయిన 16 నియోజకవర్గాల్లో, క్షేత్ర స్థాయి పర్యటనల్లోనూ, ఇతర కారణాల్లోనూ రద్దు అయిన ఇండ్లను మాప్ అప్ లాటరీ ద్వారా లబ్ధిదారులకు నవంబర్ నాలుగో తేదీ (బుధవారం ) నాడు చేపట్టనున్నారు. గతంలో 16 నియోజకవర్గాల్లో ఇండ్లను కేటాయించగా, వాటిలో 14 నియోజకవర్గాల్లో వివిధ కారణాలతో సుమారు 1700 ఇండ్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారి జాబితాలోని పేర్ల తోటే ఈ-లాటరీ నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →