హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 03:
సప్తస్వరాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ‘ఎంతెంత దయ నీది ఓ సాయి’ పేరిట నిర్వహించిన తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి శ్రోతలను అలరించింది. మంగళవారం సాయంత్రం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా లలిత కళావేదికపై ఈ కార్యక్రమం జరిగింది.
సంస్థ రెండో సీజన్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వై.ఎస్. రామకృష్ణ బృందంతోపాటు పలువురు గాయనీగాయకులు పాల్గొని మధురమైన సినీ గీతాలను ఆలపించారు. నేమాన లలిత తదితరులు తమ గానంతో సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. అతిథులు, కళాకారులు, సంగీత ప్రియుల సమక్షంలో కార్యక్రమం సాగింది.





