హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 03:
గోకులం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ‘బృందావనం’ సుబ్రహ్మణ్యం సమర్పణలో నిర్వహించిన ‘ఎవరో పాడారు భూపాలరాగం’ సంగీత కార్యక్రమం శ్రోతలను అలరించింది. మంగళవారం సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళావేదికపై గాయనీగాయకులు మధుర గీతాలను ఆలపించారు.
కార్యక్రమంలో హనుమంతరావు, సోమేశ్, లంకా ప్రసాద్, రవిప్రసాద్, సాయి సింధూర, రామలక్ష్మి, అపర్ణ, అచ్యుత పాల్గొన్నారు. తమ గానంతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు.





