Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,033+5.35%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,397/10g+0.76%
भाषाएँ

Latest News

శాసన మండలి ప్రాంగణంలో ప్రతిపాదిత అభివృద్ధి, సుందరీకరణ ప్రణాళికలను పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

nagendra4 November 2026, 5:10 AM1 व्यूtrinetnews.com
శాసన మండలి ప్రాంగణంలో ప్రతిపాదిత అభివృద్ధి, సుందరీకరణ ప్రణాళికలను పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

Share this story

Share link keeps your language (?lang=)

పర్యావరణహిత, సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 03:

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం రాష్ట్ర శాసన మండలి ప్రాంగణాన్ని సందర్శించి, అక్కడ ప్రతిపాదించిన అభివృద్ధి, సుందరీకరణ పనులు ప్రణాళికలపై హైద్రాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్, శాసన మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డిప్యూటీ స్పీకర్‌లతో పాటు శాసనసభ కార్యదర్శి, శాసన మండలి కార్యదర్శుల నివాస భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనల వివరాలను తెలుసుకున్నారు. అలాగే, శాసనసభ ప్రాంగణానికి సంబంధించిన ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్, అనుబంధ భవనం ఏర్పాటు, ఇతర అనుబంధ సౌకర్యాల అభివృద్ధి అంశాలను కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం పర్యాటక శాఖకు చెందిన భూమిని శాసనసభకు బదిలీ చేయడంతో పాటు, పక్కనే ఉన్న డీజీపీ కార్యాలయానికి సంబంధించిన కొంత భూమిని కూడా శాసనసభకు బదిలీ చేసే అంశంపై కూడా చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదిత అభివృద్ధి పనులకు గుర్తించిన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనుబంధ భవనం, పరిపాలనా భవనం, శాసనసభా పక్ష కార్యాలయాలు, విశ్రాంతి భవనం, క్రీడా మైదానం, పార్కింగ్ సౌకర్యాల అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై సమీక్షించారు. ప్రాజెక్టు ప్రతిపాదనలు, ప్రస్తుత స్థల పరిస్థితులు, ఇంజినీరింగ్ అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ ప్రాజెక్టులో పర్యావరణహిత, సుస్థిర అభివృద్ధి విధానాలను అనుసరించాలని గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న పచ్చదనానికి ఎలాంటి విఘాతం కలగకుండా, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తూ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ నయీముద్దీన్, ఆర్ అండ్ బీ ఎస్.సి మాధవి, ఈ ఈ మనోహర్ బాబు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య