సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,049+5.37%
NIFTY25,004+5.01%
22K₹1,32,462/10g+0.81%
భాషలు

తాజా వార్తలు

- సమగ్ర సేద్యంతో రైతులకు నిత్యాదాయం సాధ్యమే

nagendra4 November 2026, 5:08 AM0 చూసులుtrinetnews.com
- సమగ్ర సేద్యంతో రైతులకు నిత్యాదాయం సాధ్యమే

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

- మాజీ సైనిక మేజర్, ప్రకృతి వ్యవసాయ రైతు నవీన్ కుమార్ విజయగాథ స్ఫూర్తిదాయకం

- ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి

- మురసు తుఫాను నేపథ్యంలో పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి: మంత్రి తుమ్మల

*హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్

నవంబర్ 3:* రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యంతో పాటు పాడి పరిశ్రమ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను సమీకృతం చేసుకొని సాగు చేపట్టాలని, తద్వారా ప్రతిరోజూ ఆదాయం పొందేలా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టడం ద్వారా రైతులు నష్టాలను అధిగమించవచ్చని అన్నారు.

మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం 113వ ఎపిసోడ్‌లో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన మాజీ సైనిక మేజర్, ప్రకృతి వ్యవసాయ రైతు సి.హెచ్. నవీన్ కుమార్ తన సమీకృత వ్యవసాయ విజయగాథను రైతులతో పంచుకున్నారు. భారత సైన్యంలో మేజర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి 15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. వరి, కూరగాయల సాగుతో పాటు పాడి పశువులు, నాటు కోళ్ల పెంపకం, చేపల పెంపకం, మునగ, నేపియర్ గడ్డి, బంతిపూల సాగు చేపడుతున్నారు. వర్మీ కంపోస్టు, వర్మీవాష్, ప్రకృతి వ్యవసాయ కషాయాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో బయో రిసోర్స్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసి ఇతర రైతులకు సేంద్రియ ఎరువులు, జీవ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామగ్రిని అందిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల, నవీన్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సైన్యంలో దేశానికి సేవలందించిన అనంతరం వ్యవసాయ రంగంలోనూ ఆదర్శంగా నిలుస్తున్న ఆయన ప్రయాణం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సమీకృత వ్యవసాయ విధానాలను ఇతర రైతులు కూడా అనుసరించాలని, తమ భూమి, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించుకొని ప్రతి నీటి బొట్టును సమర్థంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్‌లో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అధిక నీటి అవసరం ఉన్న పంటల విషయంలో పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని, తక్కువ నీటితో సాగు చేసుకునే చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రైతులకు ముందస్తు అవగాహన కల్పించడంతో పాటు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన సలహాలు అందించాలని సూచించారు. మురసు తుఫాను ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. తుఫాను ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, రైతులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమంలో వాతావరణ, భూగర్భ జల, నీటిపారుదల శాఖల అధికారులు ఎల్‌నినో ప్రభావం, వర్షపాత పరిస్థితులు, భూగర్భ జలమట్టాలు, సాగునీటి ప్రాజెక్టులలో నీటి లభ్యతపై వివరించారు. అలాగే, వ్యవసాయ పరిశోధనా సంస్థలు, పశుగ్రాస పరిశోధనా కేంద్రం, ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు యాసంగిలో తక్కువ నీటితో సాగు చేసుకునే చిరుధాన్యాలు, పశుగ్రాస పంటల సాగు, మామిడి తోటల్లో పూత, పిందె దశల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.

రైతుల ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. రసాయన పురుగుమందులను అవసరమైన మేరకు,

శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులోనే వినియోగించాలని, పిచికారీ సమయంలో తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించాలని సూచించారు. పురుగుమందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ, పురుగుమందుల తయారీదారుల సంఘం రూపొందించిన 'ఇది చేయి–ఇది చేయవద్దు' భద్రతా చార్ట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో రైతులకు రక్షణ కిట్లను పంపిణీ చేశారు. అలాగే, యూపీఐ డిజిటల్ చెల్లింపుల వినియోగంపై ఎన్‌పీసీఐ ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మంత్రి మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతులతో ముఖాముఖి నిర్వహించి, రైతునేస్తం కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని మరింత మెరుగుపరిచేందుకు రైతులు తమ సూచనలు అందించాలని కోరారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతుల సందేహాలను నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ సంచాలకులు బి. గోపి, ఆర్టీసి ఎండి నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →