Monday9 November 2026Hyderabad

SENSEX81,033+5.35%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,397/10g+0.76%
Languages

Latest News

సోమాలియా తీరంలో సముద్ర దొంగల చెర నుంచి ‘అజిని’ విముక్తి భారత నౌకాదళం ఆపరేషన్‌ విజయవంతం.. 20 మంది సిబ్బంది సురక్షితం

nagendra4 November 2026, 5:03 AM1 viewstrinetnews.com
సోమాలియా తీరంలో సముద్ర దొంగల చెర నుంచి ‘అజిని’ విముక్తి భారత నౌకాదళం ఆపరేషన్‌ విజయవంతం.. 20 మంది సిబ్బంది సురక్షితం

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 03:

సోమాలియా తీరంలో సాయుధ సముద్ర దొంగలు హైజాక్‌ చేసిన ‘అజిని’ చేపల వేట నౌకను భారత నౌకాదళం విజయవంతంగా విడిపించింది. 48 గంటలకు పైగా సాగిన సమన్వయ ఆపరేషన్‌లో నౌకలోని 20 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించింది. ఈ చర్యలో ఎవరికీ గాయాలు, ప్రాణనష్టం సంభవించలేదు.

గత నెల ప్రారంభంలో సోమాలియా ఈశాన్య తీరానికి సమీపంలో అజిని నౌక హైజాక్‌కు గురైనట్లు సమాచారం అందింది. ఈ నౌకను స్థావరంగా ఉపయోగించుకుని సముద్ర దొంగలు వాణిజ్య నౌకలపై మరిన్ని దాడులకు పాల్పడే ప్రమాదం ఉండటంతో భారత నౌకాదళం రంగంలోకి దిగింది.

సముద్ర నిఘా విమానం సహకారంతో విధుల్లో ఉన్న యుద్ధనౌకను సహాయక చర్యలకు పంపించింది. నిరంతర నిఘాతో అజిని ఆచూకీని గుర్తించి, దాని కదలికలను పర్యవేక్షించింది. కాల్పులకు తావులేని నియంత్రిత చర్యలతో నౌక తప్పించుకోకుండా అడ్డుకుంది.

ఆపరేషన్‌కు అదనపు బలంగా భారత వైమానిక దళానికి చెందిన సీ–17 విమానం ద్వారా మెరైన్‌ కమాండోలను నిర్దేశిత ప్రాంతంలో ఖచ్చితత్వంతో ఎయిర్‌డ్రాప్‌ చేశారు. అనంతరం సమన్వయంతో చేపట్టిన వ్యూహాత్మక చర్యలో సముద్ర దొంగల ముప్పును అధిగమించి, నౌకను సురక్షితంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 20 మంది సిబ్బందిని విడిపించారు.

సంక్లిష్ట సముద్ర భద్రతా కార్యకలాపాలను నిర్వహించడంలో భారత నౌకాదళ సన్నద్ధతకు, దళాల మధ్య సమన్వయానికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది. నావికుల రక్షణ, కీలక సముద్ర వాణిజ్య మార్గాల భద్రత, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుస్థిరమైన భద్రతా వాతావరణం కోసం కట్టుబడి ఉన్నట్లు భారత నౌకాదళం పేర్కొంది.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య