Wednesday28 October 2026హైదరాబాద్

SENSEX73,246-0.00%
NIFTY22,699+0.05%
HYD 22K₹1,32,420/10g+1.07%
भाषाएँ

Latest News

కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి పొన్నం ప్రభాకర్

nagendra28 October 2026, 3:08 AM0 व्यूtrinetnews.com
కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి పొన్నం ప్రభాకర్

Share this story

Share link keeps your language (?lang=)

  • హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 27:

ఖమ్మం రీజియన్‌లోని మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ ప్రవళికను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఇటీవల ఓ ప్రయాణికుడు తోసివేయడంతో గాయపడిన ప్రవళిక ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వెళ్లిన మంత్రి ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రవళిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, ఆమెకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కండక్టర్ ప్రవళిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ఆమెకు అందుతున్న వైద్య చికిత్సపై వైద్యులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఆర్టీసీ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం

ప్రజలను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో ఆర్టీసీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పేద ప్రజలను గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రయాణికులు గౌరవంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఆర్టీసీ సిబ్బంది సాధారణంగా సౌమ్యంగా, నిజాయితీగా విధులు నిర్వహిస్తారని తెలిపారు.

సిబ్బంది ప్రవర్తనపై ప్రయాణికులకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఆర్టీసీ యాజమాన్యానికి లేదా సంబంధిత అధికారులకు తెలియజేయవచ్చని మంత్రి సూచించారు. అయితే, ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ఖమ్మం ఘటనపై ప్రభుత్వం సీరియస్

ఖమ్మం ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడం ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత అయినప్పటికీ, వారి ప్రాణాలకు రక్షణ కల్పించడం, విధి నిర్వహణలో భద్రతను నిర్ధారించడం కూడా అంతే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న ఆర్టీసీకి ప్రజల మద్దతు ఎంతో అవసరమని అన్నారు.

ప్రజా రవాణా వ్యవస్థ సజావుగా కొనసాగాలంటే ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది పరస్పర గౌరవంతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. ఇటువంటి దురదృష్టకర ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

यह भी पढ़ें

క్రీడల్లో స్వచ్ఛతకు భారత్‌ కట్టుబడి ఉంది: డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ డోపింగ్‌ ఉల్లంఘనలపై క్రిమినల్‌ నిబంధనలు తీసుకొచ్చేలా జాతీయ యాంటీ డోపింగ్‌ చట్టానికి మరో సవరణ 2025–26లో 7 వేలకు పైగా పరీక్షలు, 350కి పైగా అవగాహన కార్యక్రమాలు: కేంద్ర క్రీడల మంత్రి

క్రీడల్లో స్వచ్ఛతకు భారత్‌ కట్టుబడి ఉంది: డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ డోపింగ్‌ ఉల్లంఘనలపై క్రిమినల్‌ నిబంధనలు తీసుకొచ్చేలా జాతీయ యాంటీ డోపింగ్‌ చట్టానికి మరో సవరణ 2025–26లో 7 వేలకు పైగా పరీక్షలు, 350కి పైగా అవగాహన కార్యక్రమాలు: కేంద్ర క్రీడల మంత్రి

और पढ़ें →