Wednesday28 October 2026హైదరాబాద్

SENSEX73,246-0.00%
NIFTY22,699+0.05%
HYD 22K₹1,32,632/10g+1.23%
भाषाएँ

Latest News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులకు పటిష్ట ఏర్పాట్లు : టీటీడీ జేఈవో డా. ఎ. శరత్

nagendra28 October 2026, 3:03 AM0 व्यूtrinetnews.com
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులకు పటిష్ట ఏర్పాట్లు : టీటీడీ జేఈవో డా. ఎ. శరత్

Share this story

Share link keeps your language (?lang=)

తిరుపతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 27:

తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.

డిసెంబరు 5న అంకురార్పణతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుచానూరులోని ఆలయం, వాహన మండపం, నాలుగు మాడ వీధులు, పార్కింగ్ ప్రాంతాలు, క్యూలైన్లు, పుష్కరిణి, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఆయన పరిశీలించారు.

భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం

బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు హోల్డింగ్ పాయింట్లు, క్యూలైన్లు, అన్నప్రసాదం, లడ్డూ, టికెట్ కౌంటర్లను పద్ధతిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా గరుడ వాహనం, గజ వాహనం, పంచమి తీర్థం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

విద్యుత్, పుష్పాలంకరణలతో వైభవంగా ఉత్సవాలు

  • విజిలెన్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాలు, ఆలయ సిబ్బంది సమన్వయంతో పక్కా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఆలయం, వాహన మండపం, మాడ వీధుల్లో ఆకర్షణీయమైన విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టాలని, వారంలోగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి దివ్యదర్శనం చేసుకుని ఆమె కృపకు పాత్రులు కావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ మనోహరం, డిప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, సెల్వం, ఎస్‌ఈ వేంకటేశ్వర్లు, వీజీవో గిరిధర, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

यह भी पढ़ें