Thursday29 October 2026Hyderabad

SENSEX73,246-0.00%
NIFTY22,699+0.05%
HYD 22K₹1,32,963/10g+1.48%
Languages

Latest News

సుప్రీం కోర్ట్ లో వైసీపీకి ఎదురుదెబ్బ

nagendra28 October 2026, 3:01 AM0 viewstrinetnews.com
సుప్రీం కోర్ట్ లో వైసీపీకి ఎదురుదెబ్బ

Share this story

Share link keeps your language (?lang=)

అమరావతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 27:

సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ గడువును పెంచాలన్న వైసీపీ అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ ఎన్నికలపై వైసీపీ పిటిషన్‌‌పై విచారణను ముగించింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము పాటించామని ఏపీ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నామినేషన్ల సమయం ముగిసినందున ‘ఇక ఎన్నికల్లో పోటీచేయాలి.. ఆల్ ది బెస్ట్’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించా రు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఆ ఫుటేజ్‌ను కూడా భద్రపరచాలని ఎన్నికల కమిషన్‌‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. నామినేషన్లు వేయడానికి ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వట్లేదని వైసీపీ తరపు న్యాయవాది మణిందర్ సింగ్ న్యాయస్థానానికి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నివేదించింది. ఎన్నికల కమిషన్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

Also read