Wednesday28 October 2026హైదరాబాద్

SENSEX73,246-0.00%
NIFTY22,699+0.05%
HYD 22K₹1,32,632/10g+1.23%
भाषाएँ

Latest News

కాంగ్రెస్ లో విలువ కోల్పోయిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

nagendra28 October 2026, 2:45 AM0 व्यूtrinetnews.com
కాంగ్రెస్ లో విలువ కోల్పోయిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 27: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధికి నియోజకవర్గ సమస్యలపై పట్టు ఎంత అవసరమో, వాటిని ప్రభుత్వం ద్వారా సాధించుకునే రాజకీయ పరిపక్వత అంతకంటే ముఖ్యం. కానీ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వ్యవహారశైలి చూస్తుంటే, ఆయనకు కనీస రాజకీయ స్పృహ, పాలనా సంస్కారాలు కొరవడ్డాయన్న భావన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, కనీసం సొంత గ్రామంలో సైతం కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకోలేని అసమర్థత ఆయనది. అలాంటి తెలివితేటల్నే అన్ని విషయాల్లోనూ పాటిస్తున్నారు.

గతంలో ఎమ్మెల్యేలను కూడగట్టిన నిర్వాకం

గతంలో తోటి అసంతృప్త ఎమ్మెల్యేలను కూడగట్టి, అధిష్ఠానం వద్ద బేరసారాల కోసం తెరవెనుక వర్గాన్ని నడిపించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అభాసుపాలై తీవ్రమైన మైనస్ మార్కులను మూటగట్టుకున్నాయి. ఆ చేదు అనుభవాల నుంచైనా పాఠాలు నేర్చుకుని తన రాజకీయ శైలిని మార్చుకుంటారని భావిస్తే.. తాజాగా రూ.40 కోట్ల రోడ్ల పెండింగ్ బిల్లుల కోసం చనిపోతానంటూ ఆమరణ దీక్షాస్త్రం సంధించి మరోసారి తన అపరిపక్వతను బట్టబయలు చేసుకున్నారు. రోడ్లు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులనేవి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటు, ప్రాధాన్యతల ఆధారంగా విడుదలయ్యే పరిపాలనా ప్రక్రియ. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలన్నింటికీ నిధులు ఇచ్చి, కేవలం తనపైనే వ్యక్తిగత కక్షతో ఆపేశారన్నట్లుగా ఆయన మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉంది.

అంతా తెలిసి కూడా అనిరుథ్ రెడ్డి రాజకీయం

ప్రభుత్వంలో నిధుల కేటాయింపులు, ట్రెజరీ నిర్వహణ ఎలా సాగుతాయో తెలిసిన ఏ ప్రజాప్రతినిధి కూడా ఇలా బహిరంగంగా చనిపోతానని బ్లాక్‌మెయిలింగ్ తరహా ప్రకటనలు చేయరు. ఉప ముఖ్యమంత్రి, ఆర్ అండ్ బి మంత్రులపై బహిరంగంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ, ప్రతిపక్షాలకు ఆయుధాలు అందిస్తున్న తీరు ఆయన రాజకీయ అనుభవలేమిని తేటతెల్లం చేస్తోంది. సొంత నియోజకవర్గంలో రోడ్ల సమస్య వాస్తవమే కావొచ్చు, కానీ దాన్ని శాసనసభ వేదికగానో, ముఖ్యమంత్రి చాంబర్‌లోనే సమన్వయంతో సాధించుకోవాలే తప్ప.. నా ప్రాణం విలువ రూ.40 కోట్లా అంటూ సంచలనాల కోసం డ్రామాలు రక్తికట్టించడం రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం.

కాంగ్రెస్ లో విలువ కోల్పోయిన ఎమ్మెల్యే

అనిరుధ్ రెడ్డి వంటి అపరిపక్వ నేతలు చేసే వివాదాస్పద విన్యాసాలు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకే కాకుండా, పరిపాలనపై పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్షలంటూ రంకెలేస్తుంటే.. ప్రజల్లోకి పరిపాలనా వైఫల్యం అనే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాల్సిన పాలనాపరమైన అంశాలను రోడ్డుపైకి లాగి, సినిమాటిక్ డైలాగులతో చౌకబారు ప్రచారం పొందాలని చూసే ఇలాంటి ధోరణులను అధిష్ఠానం ఇకనైనా తీవ్రంగా పరిగణించకపోతే.. అది పార్టీ ఐక్యతకే కాక ప్రభుత్వ స్థిరత్వానికే చేటు తెచ్చే ప్రమాదముంది. అందుకే అనిరుథ్ రెడ్డిని ఇక లైట్ తీసుకునే అవకాశం ఉంది.

यह भी पढ़ें