Wednesday28 October 2026హైదరాబాద్

SENSEX73,246-0.00%
NIFTY22,699+0.05%
HYD 22K₹1,32,527/10g+1.15%
भाषाएँ

Latest News

బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంలో తెలంగాణ గొంతు బలంగా వినిపిస్తాం తెలంగాణ ప్రగతి, రాష్ట్ర కీలక అంశాలను అంతర్జాతీయ వేదికపై వివరిస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

nagendra28 October 2026, 2:43 AM0 व्यूtrinetnews.com
బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంలో తెలంగాణ గొంతు బలంగా వినిపిస్తాం తెలంగాణ ప్రగతి, రాష్ట్ర కీలక అంశాలను అంతర్జాతీయ వేదికపై వివరిస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 27:

అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని మరింత పెంచేందుకు కృషి చేస్తామని తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని సంవిధాన్ సదన్‌ (పాత పార్లమెంట్ భవనం)లో అక్టోబర్ 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను వివరిస్తామని స్పీకర్ తెలిపారు. బ్రిక్స్ సమావేశాల వేదికపై తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తామని పేర్కొన్నారు.

శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనం

బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రాధాన్యతలను అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తావించేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

పలువురు ప్రముఖుల భాగస్వామ్యం

12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు కూడా పాల్గొన్నారు. వివిధ దేశాల పార్లమెంటరీ ప్రతినిధులు పాల్గొనే ఈ వేదికపై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంతోపాటు, రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచేందుకు కృషి చేస్తామని స్పీకర్ తెలిపారు.

గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటన విజయవంతం కావాలని పలువురు ఆకాంక్షించారు.

यह भी पढ़ें