Sunday25 October 2026Hyderabad

SENSEX73,124-2.15%
NIFTY22,600-2.36%
HYD 22K₹1,30,645/10g-3.25%
Languages

Latest News

కేంద్ర నిధుల సాధనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

nagendra25 October 2026, 3:15 AM1 viewstrinetnews.com
కేంద్ర నిధుల సాధనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 24: కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్స్ ) కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరితగతిన రాబట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ, వ్యయ వివరాల నమోదు, సింగిల్ నోడల్ ఏజెన్సీ (SNA) ఖాతాల ముగింపు తదితర అంశాలపై ఆయన సీనియర్ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి అందుబాటులో ఉన్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రతి శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. నిధుల విడుదలకు అవసరమైన అన్ని ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసి, పెండింగ్‌లో ఉన్న అంశాలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, ఉపకార వేతనాలు, హోం, గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణం, మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి, రవాణా, పశుసంవర్ధక, మత్స్య తదితర శాఖల వారీగా కేంద్ర నిధుల పరిస్థితిని ఆయన సమీక్షించారు. ప్రతి శాఖలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలు, వ్యయ వివరాల నమోదు, SNA ఖాతాల ముగింపు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర నిధుల సాధనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి :

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించడంలో అన్ని శాఖల కార్యదర్శులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిఎస్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సమీక్షా కార్యక్రమం (CM Review), సీఎం డ్యాష్‌బోర్డులో ఈ అంశాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని శాఖల కార్యదర్శులు తమ పరిధిలోని అంశాలపై తక్షణమే సమీక్ష నిర్వహించి, నిధుల విడుదలకు అవసరమైన ప్రక్రియలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారం కోసం సంబంధిత కేంద్ర అదనపు కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైన సందర్భాల్లో తన తరఫున డి.ఓ. (Demi-Official) లేఖలు పంపిస్తానని తెలిపారు. న్యూఢిల్లీలోని సంబంధిత కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో తాను కూడా నేరుగా మాట్లాడి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేస్తానని వెల్లడించారు.

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అందుబాటులో ఉన్న నిధులు రాష్ట్రంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత బలోపేతం చేస్తాయని పేర్కొంటూ, నిధుల సాధనలో ఎలాంటి జాప్యం జరగకుండా అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్ లు బి.ఎం.డి. ఎక్కా, దానకిషోర్, ముఖ్య కార్యదర్శులు రాహుల్ బొజ్జా, సందీప్ కుమార్ సుల్తానీయా, యోగితారాణా, అహ్మద్ నదీమ్, క్రిస్టినా జొంగ్తు, కార్యదర్శులు గౌరవ్ ఉప్పల్, సురేంద్ర మోహన్, శృతిఓజా, దివ్య, ఇలంబర్తి, లా సెక్రెటరీ పాపిరెడ్డి, విజయేందీర, కాంతి వెస్లీ, తదితరులు పాల్గొన్నారు.

Also read