ఆదివారం25 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,124-2.15%
NIFTY22,600-2.36%
22K₹1,30,645/10g-3.25%
భాషలు

తాజా వార్తలు

"పోయినది ఏది తిరిగి రాదు" " విలువ కరిగిపోయిన తరువాత కాలం విలువ తరిగిపోయిన తరువాత డబ్బు విలువ తెగిపోయిన తరువాత బంధం విలువ పోగొట్టుకున్న తరువాత ఆరోగ్యం విలువ.... ఏది తిరిగి రాదు."

nagendra25 October 2026, 3:09 AM0 చూసులుtrinetnews.com
"పోయినది ఏది తిరిగి రాదు" " విలువ కరిగిపోయిన తరువాత కాలం విలువ తరిగిపోయిన తరువాత డబ్బు విలువ తెగిపోయిన తరువాత బంధం విలువ పోగొట్టుకున్న తరువాత ఆరోగ్యం విలువ.... ఏది తిరిగి రాదు."

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్ న్యూస్ శశి మోహన కాంతి కిరణం....

  1. ఎంత అద్భుతమైన సూక్తి. మనిషై పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకొని, అర్థం చేసుకొని ,ఆచరించవలసిన సూక్తి ఇది. కాలం గాని, డబ్బు గాని, బంధం కానీ, ఆరోగ్యం కానీ ఒక్కసారి పోతే ఏది తిరిగి రాదు. ఇవన్నీ మన చేతిలో ఉన్నప్పుడు వాటి విలువ మనం గుర్తించం, మనకు తెలియదు.

మనిషి జీవితకాలం చాలా పరిమితమైంది. ఈ సృష్టిలో మనం ఏదైనా సరే తిరిగి సంపాదించుకోవచ్చు ఒకవేళ పోగొట్టుకున్న కానీ కొన్ని విషయాలు మాత్రం ఒక్కసారి చేయి జారిపోతే ప్రపంచమంత వెతికిన దొరకవు అందుకే పెద్దలు" గడిచిన కాలం వెనుకకు రాదు "అని చెప్పారు. ఎందుకంటే కాలం అన్నది నిరంతర ప్రవాహం లాంటిది. అది ఎవరి కోసం ఆగదు .ఆ ప్రభావం వెనక్కి ప్రయాణించదు. మనం వృధా చేసే ప్రతి నిమిషం మన జీవితం నుండి శాశ్వతంగా మాయమైపోయినట్లే.

చదువుకునే రోజుల్లో యువతకు ఈ కాలం విలువ తెలియక వినోదాలకు ,వ్యసనాలకు బలి పెడతారు. ఉన్న కాలమంతా సరదాగా కాలక్షేపం చేస్తారు. చదువుకి ప్రాధాన్యత ఇవ్వరు. తీరా చదువులో ఫెయిల్ అయిన తరువాతనో, మంచి అవకాశాలు చేయి జారిపోయినప్పుడో ..అప్పుడు అనిపిస్తుంది అయ్యో ఆ రోజుల్లో కష్టపడి ఉంటే బాగుండేది అని .కానీ నేను అన్నట్లు కరిగిపోయిన ఆ బంగారు కాలం మళ్ళీ వస్తుందా??

అందుకే మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. కాలానికి మనం ఇచ్చే విలువ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

ఇక డబ్బు విషయానికి వస్తే... మనిషి బ్రతకడానికి డబ్బు చాలా అవసరం .కానీ చాలామంది డబ్బు చేతిలో ఉన్నప్పుడు దానిని నీళ్ళలాగా ఖర్చు చేస్తారు. రేపటి పరిస్థితి ఏంటి అని ఆలోచించరు. చేతులో డబ్బు గలగలలాడుతూ ఉంటే విలాసాలకు ,అనవసరమైన వాటికి ఖర్చు పెడతారు. ఎప్పుడైతే ఆపద వస్తుందో లేదా ఉద్యోగమో, వ్యాపారమో దెబ్బతింటుందో అప్పుడు రూపాయి విలువ అర్థమవుతుంది .చేతిలో పైసలు లేనప్పుడు సమాజం చూసే చూపులో చాలా మార్పు వస్తుంది. ఉన్నప్పుడు దాచుకోని డబ్బు అవసరమైనప్పుడు తిరిగి రాదు సరి కదా అప్పుల ఊపులోకి నెట్టేస్తుంది.

కనుక కాలం కరిగిపోక ముందే డబ్బుకు తరిగిపోతుంటే వాటిని జాగ్రత్తగా ఉపయోగించటం వివేకవంతుని లక్షణం అలాగే కాలం విలువ తెలుసుకొని బ్రతకాలి.

ఇక బంధాల మాటకొస్తే ...మనిషి సంఘజీవి. సమాజంలో బంధుత్వాలు ,స్నేహాలు మనిషికి మానసిక శక్తిని ఇస్తాయి. కానీ నేడు ఆధునిక కాలంలో మనుషులు అహంకారంతో బంధాలను అనుబంధాలను తెంచి వేసుకుంటున్నారు. చిన్ని చిన్ని తగాదాలు, ఈగోలు, కోపంలో నాలుక జారటాలు వంటి వాటి వల్ల బంధాలు దూరమైపోతున్నాయి ఒకసారి బంధం తెగిన తర్వాత మళ్లీ ఎంత బ్రతిమిలాడిన ఆ పాత స్నేహం లేదా పాత ప్రేమ తిరిగి రాదు. పగిలిన అద్దాన్ని అతికించలేము అలాగే విరిగిపోయిన మనసులను మళ్ళీ కలపలేము. దూరం అయిపోయిన తర్వాత వారి జ్ఞాపకాలలో మిగలడం తప్ప మరి ఏమి జరగదు.

ఆరోగ్య విషయానికొస్తే కోట్లు సంపాదించిన అనుభవించడానికి ఆరోగ్యం లేకుంటే ఆ సంపద అంతా బూడిదలు పోసిన పన్నీరు లాంటిదే. ఈ కాలంలో డబ్బు సంపాదన ధ్యాసలో పడి వేళకు తినకపోవడం, నిద్రపోకపోవడం మానసిక ఒత్తిడికి గురికావడం వలన చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నారు. శరీరం సహకరించినంతకాలం నిర్లక్ష్యం చేస్తున్నారు ఒకసారి ఏదైనా జబ్బు వస్తే లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి వస్తే తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. "అన్ని పడకలలోనూ ఖరీదైన పడక (అంటే బెడ్) అంటే హాస్పిటల్ బెడ్" అని మహాత్ములు చెప్పారు. కొన్ని రోగాలు వస్తే మనుషులు కూడా దూరంగా ఉంటారు. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.

చివరగా చెప్పేది ఏమిటంటే....

మనుషులు మనతో ఉన్నప్పుడు గౌరవించడం, ప్రేమించడం నేర్చుకోవాలి. అలాగే మన శరీరాన్ని మనం ప్రాణప్రదంగా చూసుకోవాలి. బంధాలు తెగకముందే అహాన్ని వీడాలి, ఆరోగ్యం పాడవకముందే జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే ఇవి ఒకసారి పోతే మళ్ళీ తిరిగిరావు.

శుభోదయం... శశి బాల

ఇవి కూడా చదవండి