Sunday25 October 2026హైదరాబాద్

SENSEX73,124-2.15%
NIFTY22,600-2.36%
HYD 22K₹1,30,645/10g-3.25%
भाषाएँ

Latest News

రోడ్డు ప్రమాద బాధితులకు అండగా పీ.ఎం రాహత్ పథకం

nagendra25 October 2026, 3:06 AM1 व्यूtrinetnews.com
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా పీ.ఎం రాహత్ పథకం

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 24:

రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించే పీ.ఎం రాహత్ పథకం లో రాష్ట్రంలోని అన్ని నెట్ వర్క్ హాస్పిటల్స్ ను నమోదుచేయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కోరారు. ప్రధాన మంత్రి రోడ్డు ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో మెరుగైన చికిత్సా పథకం (పీ.ఎం రాహత్) అమలుపై రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లు, ట్రాన్స్పోర్ట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రవాణా శాఖ కమీషనర్ ఇలంబర్తి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, ఆరోగ్య శ్రీ సి.ఈ.ఓ జెండగి హనుమంతు లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.ఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను తక్షణమే గోల్డ్ అవర్ లో సమీపంలోని ఆసుపత్రిలో చేర్చితే వైద్య చికిత్సలకు పీ.ఎం రాహత్ పథకం కింద లక్షన్నర రూపాయ విలువైన చికిత్సలు అందించడం జరుగుతుందని అన్నారు. అయితే, ఈ పీ.ఎం రాహత్ పథకంలో రాష్ట్రంలోని హాస్పిటల్స్ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ పథకంలో ఒక వెయ్యికి పైగా హాస్పిటల్స్ నమోదు కాగా, ఈ పీ.ఎం రాహత్ స్కీమ్ లో కేవలం 469 ఆసుపత్రులు మాత్రమే ఎన్రోల్ అయ్యాయని తెలిపారు. మిగిలిన ఆసుపత్రులన్నింటినీ ఈ పీ.ఎం రాహత్ పథకంలో నమోదు అయ్యేవిధంగా తగు చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సి.ఎస్ ఆదేశించారు. ఈ పథకం క్రింద ప్రతీ సంవత్సరం కనీసం ఒక వంద కోట్లరూపాయలు చికిత్సలకు అందించే అవకాశం ఉందని వివరించారు. తద్వారా ఆరోగ్య శ్రీ పథకానికి కూడా భారం తగ్గుతుందని అన్నారు. అయితే, ఈ పీ.ఎం రాహత్ పథకం క్రింద చికిత్సలు జరపాలంటే తగు పోలీసు దర్యాప్తు తదితర నిబంధనలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

यह भी पढ़ें