Thursday22 October 2026Hyderabad

SENSEX73,468-1.14%
NIFTY22,745-1.10%
HYD 22K₹1,33,257/10g-1.35%
Languages

Latest News

చుక్కా రామయ్య డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ ని ప్రారంభించిన కేవి రమణ చారి

nagendra22 October 2026, 2:20 AM5 viewstrinetnews.com
చుక్కా రామయ్య డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ ని ప్రారంభించిన కేవి రమణ చారి

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ అక్టోబర్ 22:

టి.వి. చక్రం డాక్యుమెంటరీల నిర్మాణంలో పేరుప్రఖ్యాతి గాంచిన “కిన్నెర చరిత్ర” ప్రముఖ విద్యావేత్త, ఐ.ఐ.టి. విద్యార్థుల శిక్షణా నిపుణులు, 102 సంవత్సరాల వయోవృద్ధులు చుక్కా రామయ్య డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణాన్ని ప్రభుత్వ విశ్రాంత సలహాదారు, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ కె.వి. రమణగారు ప్రారంభోత్సవం

చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామయ్య విశిష్ట గుణాలను, విద్యార్థులకు అందించిన కృషిని వివరించారు. ఐఐటి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో రామయ్య చూపిన ప్రతిభను కొనియాడారు. రామయ్య పిలువబడే బోధనా రాముడు అనే పేరుకు తగ్గట్లుగా స్వయంకృషి, వ్యక్తిత్వ వికాసము, పట్టుదలతో ఉన్నతంగా ఎదగటం చుక్కా రామయ్య ప్రస్థానం చెబుతుందని ప్రశంసించారు. కిన్నెర చరిత్ర చలన చిత్రం మద్దాళి రఘురాం నిర్మిస్తున్న ఈ డాక్యుమెంటరీ చిత్రానికి ఆర్.డి.ఎం. సత్యనారాయణ నిర్మాణ సహకారం, విజయకుమార్ కెమెరా, ఎడిటింగ్, పి.వి. చలం దర్శకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రారంభ చిత్రీకరణ కార్యక్రమానికి కిన్నెర సభ్యులు విజయకుమార్, వెంకట్రావు, సుబ్బారావు, రాధాకృష్ణలతో పాటు రామయ్యగారి చిన్న కుమారుడు ఆచార్య చుక్కా పాల్గొన్నారు.

Also read