Thursday22 October 2026Hyderabad

SENSEX73,417-1.21%
NIFTY22,753-1.06%
HYD 22K₹1,33,159/10g-1.41%
Languages

Latest News

ఆకట్టుకున్న నాట్యభారతి కూచిపూడి నృత్య ప్రదర్శనలు

nagendra22 October 2026, 2:16 AM5 viewstrinetnews.com
ఆకట్టుకున్న నాట్యభారతి కూచిపూడి నృత్య ప్రదర్శనలు

Share this story

Share link keeps your language (?lang=)

ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ నరసింహ కూచిపూడి నాట్యభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. కళాకారులు ‘శ్రీనృసింహ’ కూచిపూడి రూపకంతోపాటు శ్లోకాలు, వివిధ నాట్యాంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

కార్యక్రమంలో వాణిలక్ష్మి గణపతి, మహాగణపతిం, నటేశ కౌత్వం, జయము జయము, ఎంత మాత్రమున, జయ జనార్ధన, గజనాయకాయ (బ్రహ్మాంజలి), నృత్యతి తదితర అంశాల్లో విద్యార్థులు తమ నాట్య ప్రతిభను చాటారు. ‘ప్రహ్లాద పట్టాభిషేకం’ (కొలువైతివరంగసాయి), తిల్లాన ప్రదర్శనలతోపాటు ‘మహిషాసుర మర్దిని’ నృత్యనాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కార్యక్రమానికి జొన్నాడ, సిద్ధప్ప, బాబులాల్, లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నృత్య ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. అనంతరం కళాకారులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.

Also read