గురువారం22 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,339-1.31%
NIFTY22,625-1.62%
22K₹1,33,008/10g-1.30%
భాషలు

తాజా వార్తలు

మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి

nagendra22 October 2026, 2:15 AM5 చూసులుtrinetnews.com
మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

మైసూరు, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21: కర్ణాటక రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్ర పండుగగా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవాల్లో భాగంగా మైసూరు రాజభవనం ఎదుట నిర్వహించిన జంబూ సవారిని ఆయన వీక్షించారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఈ వేడుకలకు హాజరైన రేవంత్ రెడ్డి, దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులతో కలిసి ఉత్సవాలను తిలకించారు. మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే జంబూ సవారిలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా సాగిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కన్నడ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా జానపద కళాకారులు, సంగీత బృందాలు, నృత్య బృందాలు, వివిధ సాంస్కృతిక బృందాలు ఊరేగింపులో పాల్గొన్నాయి. కళాకారుల ప్రదర్శనలు, సంప్రదాయ వేషధారణలు, ఉత్సవ వైభవం మైసూరు దసరా ప్రత్యేకతను చాటిచెప్పాయి. జంబూ సవారికి హాజరయ్యే ముందు సీఎం రేవంత్ రెడ్డి మైసూరు ప్రజల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్ణాటక నాడ హబ్బగా పేరొందిన మైసూరు దసరా ఉత్సవాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావం, కళలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఈ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుండగా, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల హాజరుతో ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం చేకూరింది.

ఇవి కూడా చదవండి