Thursday22 October 2026Hyderabad

SENSEX73,468-1.14%
NIFTY22,745-1.10%
HYD 22K₹1,33,257/10g-1.35%
Languages

Latest News

" జీవితాల్లో కష్టాలు ఆటంకాలు ఎదురైనప్పుడే మనిషి రాటు తేలుతాడు విజయాలు సాధిస్తాడు."

nagendra22 October 2026, 2:14 AM5 viewstrinetnews.com
" జీవితాల్లో కష్టాలు ఆటంకాలు ఎదురైనప్పుడే మనిషి రాటు తేలుతాడు విజయాలు సాధిస్తాడు."

Share this story

Share link keeps your language (?lang=)

శశి మోహన కాంతి కిరణం...83

(Only when faced with hardships and obstacles in life does a person become resilient and achieve success.")

జీవితంలో కష్టాలు మరియు అడ్డంకులను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనిషి తట్టుకునే శక్తిని (స్థితప్రజ్ఞతను) పొంది విజయం సాధిస్తాడు."

మనిషి తన జీవన గమనంలో నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటాడు ఆ ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు. ఎన్నెన్నో ఎత్తు పల్లాలు ,సుఖదుఃఖాలు ,కష్ట నష్టాలు అన్నీ కూడా దాటవలసి ఉంటుంది.

కష్టాలు ఎదురైనప్పుడే మనిషి బలోపేతంగా తయారవుతాడు. కష్టాలకు కోర్చుకొన్ననే సుఖాలు దక్కును.. అన్నాడు ఒక మహాకవి. ఉలి దెబ్బలు తింటేనే రాయి అద్భుతమైన శిల్పంగా మారుతుంది.

నిప్పులో కాలిస్తేనే బంగారం అపరంజిగా మారుతుంది.

జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలు అనుభవాలు మనిషిని స్థితప్రజ్ఞుడిగా మారుస్తాయి . జ్ఞానవంతుడిగా తీర్చి దిద్దుతాయి. సుఖాలలో ఉన్న వ్యక్తి కష్టం యొక్క విలువను గ్రహించలేడు.

ఆకలితో ఉంటే గానీ మనిషికి అన్నం విలువ, ఆహారం విలువ తెలియదు.

Obstacles are they stepping stones for victory. అవరోధాలే మనిషి విజయానికి సోపానాలు.

థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టడానికి ఎంతో కష్టపడ్డాడు. ఓటములు చవిచూచాడు. చివరికి విజయం సాధించాడు. పేదరికంలో పుట్టి ఎన్నో వ్యక్తిగత రాజకీయ పరజయాలను చవిచూసిన అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు.

కష్టాలు వచ్చినప్పుడు క్రుంగగూడదు. సుఖాలు వచ్చినప్పుడు పొంగకూడదు. ఇది ప్రతి మనిషి తెలుసుకోవలసిన నీతి. అందుకే అన్నారు "సోమరియై తిరుగువాడు సూక్ష్మమ్మ గ్రహింపలేడు" అని. సుఖమైన జీవితం మనిషిని సోమరిగా అసమర్థుడుగా తయారు చేస్తుంది. అతనిలో నిద్రాణమై ఉన్న నైపుణ్యాన్ని దాచేస్తుంది. ఆ శక్తిని బయటకు తీసి ,పదును పెట్టి నప్పుడే కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. కష్టాలు పడ్డప్పుడు మనిషి ఆ ఒరవడికి పదునెక్కుతాడు రాటుదేలుతాడు. దక్షిణ ఆఫ్రికాలో రైలు నుంచి కిందకి తోసిపడిన ఒక సాధారణ న్యాయవాది, ఒక అసాధారణ శక్తిగా గొప్ప నాయకుడిగా మారాడు. ఎవరో కాదు మహాత్మా గాంధీ.

విపరీతమైన ఒత్తిడి ,వేడికి గురైనప్పుడు బొగ్గు అమూల్యమైన వజ్రంగా మారుతుంది.

జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి కూలత మనిషిని తేజోవంతంగా మారుస్తుంది. విజేతకు ఆటంకాలు తాత్కాలికమైనవి. ప్రతి ఓటమిలోనూ విజేత తన లోపాలను గుర్తించి వాటిని అధిగమిస్తాడు.

అంతేకాదు కష్టాలలో ఉన్నప్పుడే మనిషి తన మిత్రులెవరో ,శత్రువులెవరో గ్రహిస్తాడు. ఇలా కష్టాలు మనిషిని తీర్చిదిద్దుతాయి .అతనికి ఒక ఆటంకం వల్ల గమనం ఆగిపోకుండా, కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ సాగిపోయే గుణాన్ని అలవరుస్తుంది.

కష్టేఫలి అన్నారు అందుకే.

శుభోదయం ...శశిబాల

Also read