Thursday22 October 2026Hyderabad

SENSEX73,468-1.14%
NIFTY22,745-1.10%
HYD 22K₹1,33,257/10g-1.35%
Languages

Latest News

రాష్ట్రానికి ఏదోఒకరోజు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

nagendra22 October 2026, 2:07 AM2 viewstrinetnews.com
రాష్ట్రానికి ఏదోఒకరోజు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్రానికి ఏదో

ఒకరోజు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని, బీసీ సీఎం విషయంలో మాకు ఎలాంటి తొందర కానీ డెడ్లైన్లు లేవని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తుంటే 2034 వరకే కాదు 2039 వరకు కూడా మేమే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా బీసీ వ్యక్తి అవుతారని, ఇది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని తీరువల్ల వచ్చే ఎన్నికల్లో మేమే గెలస్తామని అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్నారన్నారు. వచ్చే టర్మ్ లో రేవంత్ రెడ్డి సీఎం అయినా మాకు ఎలాంటి తొందర లేదని భవిష్యత్లో బీసీ వ్యక్తి సీఎం అవుతారన్నారు. తాజాగా ఓ యూటూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుంతో ఎవరూ చెప్పలేరన్నారు. బీసీ నినాదం రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు. 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికేనన్నారు. ఇందులో తప్పేమి లేదన్నారు. బీసీ ముఖ్యమంత్రి అనేది బీఆర్ఎస్ సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే బీసీలను సీఎం చేస్తామంటున్న బీజేపీ కనీసం రాష్ట్ర అధ్యక్షుడిని

పదవిని కూడా బీసీకి ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. బీసీ నేత బండి సంజయ్ రాష్ట్ర

అధ్యక్షుడిగా ఉంటే ఆ పదవిని, గతంలో బండారు దత్తాత్రేయ సీటును కిషన్ రెడ్డి లాక్కున్నారన్నారు. తాము ఇచ్చిన కార్పొరేషన్ పదవులు

అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బడుగు, బలహీన వర్గాలకే ఎక్కవ అవకాశం ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిట్ మెంట్తో ఉందన్నారు. కొండా సురేఖ అంశంపై స్పందిస్తూ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత తొందరపడ్డారని అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో జబ్బలు చరుచుకుంటే సరిపోదని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పరిపాలనను, వారి పోలీసు రాజ్యాన్ని ప్రజలు చూశారు. మరోసారి వారికి అవకాశం ఇచ్చే అవకాశం లేదన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ మొక్క మొలకెత్తదన్నారు. రేవంత్ రెడ్డికి తనకు మధ్య కెమిస్ట్రీ కుదిరిందన్నారు. తన విషయంలో జరుగుతున్న దుష్ప్రచారం పట్టించుకోని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Also read