Thursday22 October 2026Hyderabad

SENSEX73,555-1.02%
NIFTY22,725-1.19%
HYD 22K₹1,33,223/10g-1.27%
Languages

Latest News

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.

nagendra22 October 2026, 2:05 AM2 viewstrinetnews.com
ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.

Share this story

Share link keeps your language (?lang=)

న్యూ ఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21:

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్‌)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్‌ అనేది కేవలం పురుషులతో కూడిన రాజ్యాంగ వ్యతిరేక సంస్థ అని ఆరోపించారు. మహిళలను పురుషుల ఆస్తిగా భావిస్తుందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. రాహుల్ గాంధీకి సరైన అవగాహన లేదని, ఆయన వ్యాఖ్యలు పిల్లచేష్టలను తలపిస్తున్నాయని విమర్శించారు. అర్

ఎస్‌ఎస్‌ను విమర్శిస్తూ రాహుల్ గాంధీ మంగళవారం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. 'ఆర్‌ఎస్‌ఎస్ అనేది మహిళలను పురుషుల ఆస్తిగా భావిస్తుంది. పూర్తిగా పురుషులతో కూడిన రాజ్యాంగ వ్యతిరేక సంస్థ. నేను శివ శక్తిని నమ్ముతాను. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌తో పోరాడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మరో విషయం ఏమిటంటే, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన చాలా మంది మహిళలు నా పక్షాన ఉన్నారు' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Also read