హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17 :
దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో శనివారం గృహకల్ప కాంప్లెక్స్, ఎం.జె. రోడ్, నాంపల్లి, హైదరాబాద్లో దుర్గాపూజ మరియు బతుకమ్మ వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన దుర్గాపూజలో అధికారులు, సిబ్బంది పాల్గొని, లోకకల్యాణం, శాంతి, సౌభాగ్యం ప్రజలందరి శ్రేయస్సు కోసం అమ్మవారి ఆశీస్సులు కోరారు. నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్, సభ్యురాలు - శివాడి ప్రవీణ, సభ్యుడు - డా. బి. కిషోర్, కమిషన్ కార్యదర్శి సీఈఓ లు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొహమ్మద్ షహాబుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి. శ్రీనివాస్ రావు, పీఆర్వో
రాములు, డీఎస్పీ, తదితర గెజిటెడ్ నాన్-గెజిటెడ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





