Sunday18 October 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g+0.09%
भाषाएँ

Latest News

శిక్షణలో ఉన్న సివిల్ సర్వీసెస్ అధికారుల కోసం ప్రత్యేక వారసత్వ పర్యటన

nagendra18 October 2026, 2:57 AM0 व्यूtrinetnews.com
శిక్షణలో ఉన్న సివిల్ సర్వీసెస్ అధికారుల కోసం ప్రత్యేక వారసత్వ పర్యటన

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,

అక్టోబర్ 17: తెలంగాణ ప్రభుత్వ పర్యాటక, వారసత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణలో ఉన్న సుమారు 170 మంది సివిల్ సర్వీసెస్ అధికారుల కోసం శనివారం ప్రత్యేక వారసత్వ పర్యటన నిర్వహించారు. ఈ పర్యటన చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద ప్రారంభమై, ప్రసిద్ధ చారిత్రక భవనం చౌమహల్లా ప్యాలెస్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా అధికారులు హైదరాబాద్ నగర చరిత్ర, విశిష్ట నిర్మాణ శైలి, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకునే అవకాశం లభించింది. హైదరాబాద్ నగర సాంస్కృతిక గుర్తింపులో ఈ చారిత్రక కట్టడాల ప్రాధాన్యతను, వాటి చారిత్రక నేపథ్యాన్ని శిక్షణలో ఉన్న అధికారులకు వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక సంపదపై అవగాహన కల్పించడంతో పాటు, రాష్ట్ర పర్యాటక ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు అధికారులకు అవగాహన కల్పించారు.

यह भी पढ़ें