ఆదివారం18 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,320/10g+0.09%
భాషలు

తాజా వార్తలు

పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారిగా శ్రీ మలయప్పస్వామి దివ్య దర్శనం కొబ్బరి ఆకులతో అద్భుతంగా పుష్పక విమానం.. సంప్రదాయ పుష్పాలతో సుందర అలంకరణ

nagendra18 October 2026, 2:55 AM0 చూసులుtrinetnews.com
పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారిగా శ్రీ మలయప్పస్వామి దివ్య దర్శనం కొబ్బరి ఆకులతో అద్భుతంగా పుష్పక విమానం.. సంప్రదాయ పుష్పాలతో సుందర అలంకరణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 17:

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శనివారం సాయంత్రం పుష్పక విమానంపై రుక్మిణి, సత్యభామ సమేతంగా గోవర్ధనగిరిధారి శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు అభయమిచ్చారు. స్వామివారి దివ్యమంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పక విమానసేవను నిర్వహించడం విశేషం. వాహనసేవల అనంతరం స్వామి, అమ్మవార్లు సేదతీరే సంప్రదాయంలో భాగంగా ఈ సేవను నిర్వహిస్తారు.

కొబ్బరి ఆకులతో అద్భుత పుష్పక విమానం

కొబ్బరి చెట్ల ఆకులతో రూపొందించిన ఈ ప్రత్యేక పుష్పక విమానం 24 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో, సుమారు ఒక టన్ను బరువు ఉంటుంది. వివిధ రకాల సంప్రదాయ పుష్పాలతో దీనిని సుందరంగా అలంకరించారు. విమానానికి ఇరువైపులా శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతుడు, నాలుగు యుగాలకు చెందిన దేవతామూర్తుల రూపాలను తీర్చిదిద్దారు.

వారం రోజుల శ్రమతో రూపుదిద్దుకున్న కళాఖండం

తమిళనాడుకు చెందిన నిపుణులు, టీటీడీ గార్డెన్ విభాగం సిబ్బంది వారం రోజుల పాటు శ్రమించి ఈ అద్భుత పుష్పక విమానాన్ని సిద్ధం చేసినట్లు టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. చెన్నైకి చెందిన దాత రాంప్రసాద్ భట్ ఈ పుష్పక విమాన రూపకల్పనకు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి