- *గౌరమ్మ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,
అక్టోబరు 17: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి, ప్రకృతి ఆరాధనకు, మహిళా శక్తికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పూలతో బతుకమ్మను అలంకరించి గౌరమ్మను ఆరాధించడం ప్రకృతితో మనకున్న విడదీయరాని అనుబంధానికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల్లో భక్తిభావాన్ని, సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని తెలిపారు. గౌరమ్మ దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.





