Sunday18 October 2026Hyderabad

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g+0.09%
Languages

Latest News

భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం

nagendra18 October 2026, 2:50 AM0 viewstrinetnews.com
భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం

Share this story

Share link keeps your language (?lang=)

  • ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17:

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఔషపూర్ శ్రీశ్రీశ్రీ అమ్మ దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో మహా చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తులు హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పాలతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ, ఒడి బియ్యం సమర్పణ, మహా నైవేద్య నివేదన నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక ధర్మకర్త దేవులపల్లి శైలజ జ్యోతికుమార్ తెలిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Also read