ఆదివారం18 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,320/10g+0.09%
భాషలు

తాజా వార్తలు

సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో క్షేత్ర పర్యటన కాలీఫ్లవర్, షేడ్ నెట్ హౌస్, పత్తి పంటలను పరిశీలించిన వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్రమోహన్

nagendra18 October 2026, 2:46 AM0 చూసులుtrinetnews.com
సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో క్షేత్ర పర్యటన కాలీఫ్లవర్, షేడ్ నెట్ హౌస్, పత్తి పంటలను పరిశీలించిన వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్రమోహన్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఎల్‌నినో నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి

యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు, స్ప్రింక్లర్ ద్వారా సేద్యం చేయాలి

ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్ పరికరాలు, సబ్సిడీ విత్తనాలు అందజేయాలని ఆదేశం

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,

అక్టోబర్ 17: వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్రమోహన్ ఐఏఎస్ శనివారం సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు.

కోదాడ మండలంలో కాలీఫ్లవర్ అంత క్షేత్ర సందర్శన

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో కాలీఫ్లవర్ సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను స్వయంగా పరిశీలించారు. రైతు ఖాజామియా 6 ఎకరాల్లో కాలీఫ్లవర్ సాగు చేస్తున్నారు.

ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ పంటలు సాగు చేయాలని సూచించారు. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు డ్రిప్ పరికరాలు, సబ్సిడీ విత్తనాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్‌లో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలను స్ప్రింక్లర్ సేద్య పద్ధతిలో సాగు చేసుకోవాలని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులపై రైతు వేదికల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా రైతులు తమకు సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని కోరారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి స్వయంగా పొలాలను సందర్శించి సూచనలు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

కొర్లపహాడ్‌లో షేడ్ నెట్ హౌస్ సందర్శన

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో సమీకృత ఉద్యానాభివృద్ధి మిషన్ పథకం కింద ఏర్పాటు చేసిన షేడ్ నెట్ హౌస్‌ను పరిశీలించారు. రైతు ఆలం మౌనిక ఈ షేడ్ నెట్ హౌస్‌లో ఆకుకూరలు, ఉల్లిని సాగు చేస్తున్నారు. అలాగే గ్రోబ్యాగుల్లో అల్లం, పసుపు పంటలను ఒక్కో పంటకు 13,500 మొక్కలను పెంచుతున్నారు. పసుపులో మేఘాలయ రకం, అల్లంలో రియో డి జెనీరో రకం సాగు చేస్తున్నారు .ఆర్వో ప్లాంట్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో పోషకాలు అందిస్తున్నారు.

రైతులు మౌనిక, హారిక ఇద్దరూ ఏడాది కాలంగా ఈ సాగు చేస్తున్నారు. ఈ యూనిట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు ఎంఐడీహెవ్

పథకానికి పంపినట్లు అధికారులు తెలిపారు. కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు.

ఆరెగూడెంలో పత్తి క్షేత్రాల పరిశీలన

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో పత్తి పంట క్షేత్రాలను సందర్శించారు. రైతులతో ముచ్చటించి, పంట పరిస్థితి, సాగులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనల్లో ఆయా జిల్లాల జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి