Sunday18 October 2026Hyderabad

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g+0.09%
Languages

Latest News

యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ (ఏయ్ జూడ్) హీరోగా కొత్త సినిమా ప్రారంభం

nagendra18 October 2026, 2:42 AM0 viewstrinetnews.com
యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ (ఏయ్ జూడ్) హీరోగా కొత్త సినిమా ప్రారంభం

Share this story

Share link keeps your language (?lang=)

యూట్యూబ్ సెన్సేషన్, ‘ఏయ్ జూడ్’గా పాపులర్ అయిన అజయ్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా నేడు అధికారికంగా ప్రారంభమైంది. రాము కొప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నెక్సస్ సినిమాస్, స్కైబ్లేజ్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్లపై నెక్సస్ శ్రీధర్, దీపక్ ముస్త్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, ఫహాద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రాఫర్‌గా, క్రాంతి ప్రియమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

రామానాయుడు స్టూడియోస్‌లో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు, ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ గారు తొలి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు బుచ్చిబాబు సానా గారు తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకకు బెజవాడ ప్రసన్న గారు, థామస్ రెడ్డి ఆదూరి, డా. పృథ్వీరాజ్ గారు (క్రాంతిదళ్), శ్రీనివాస్ దాసరి గారు (కలోజీ టీవీ), రఘు గంజి గారు (తొలి వెలుగు), బాబు డేగల గారు, సత్యం రాజేష్ గారు తదితర ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Also read