Sunday18 October 2026Hyderabad

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g-0.23%
Languages

Latest News

విజయ్ దేవరకొండ "రౌడీ జనార్థన" మూవీ నుంచి హీరోయిన్ కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

nagendra18 October 2026, 2:39 AM0 viewstrinetnews.com
విజయ్ దేవరకొండ "రౌడీ జనార్థన" మూవీ నుంచి హీరోయిన్ కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

Share this story

Share link keeps your language (?lang=)

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ "రౌడీ జనార్థన". స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రౌడీ జనార్థన" సినిమా రూపొందుతోంది.

ఈ రోజు హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ "రౌడీ జనార్థన" సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ ట్రెడిషనల్ లుక్ లో బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. "రౌడీ జనార్థన" సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు రౌడీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

నటీనటులు - విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, తదితరులు

టెక్నికల్ టీమ్

------------------------

ప్రొడక్షన్ డిజైనర్ - డినో శంకర్

డీవోపీ - ఆనంద్ సి చంద్రన్

బ్యానర్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

ప్రొడ్యూసర్స్ - దిల్ రాజు, శిరీష్

పీఆర్ఓ - సురేష్ (ఎస్ కే మీడియా)

స్టోరీ డైరెక్షన్ - రవికిరణ్ కోలా

Also read