Sunday18 October 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g+0.09%
भाषाएँ

Latest News

రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

nagendra18 October 2026, 2:36 AM0 व्यूtrinetnews.com
రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Share this story

Share link keeps your language (?lang=)

  1. యాదాద్రి భువనగిరి, అక్టోబరు16/ట్రైనెట్ న్యూస్:

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని,శనివారం రోజు రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలతో అలంకరించిన బతుకమ్మలతో కోర్టు ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవా సమితి చైర్మన్ జి.సబిత హాజరయ్యారు. అలాగే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. షిరీష,అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి,సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి దంతూరి సత్తయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. మజీద్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయస్థాన సిబ్బంది, పోలీసు అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పూల పండుగ విశిష్టతను చాటుతూ అందరూ కలిసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ఈ సందర్భంగా చాటిచెప్పారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయస్థాన సిబ్బంది, పోలీసు అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం ద్వారా పరస్పర స్నేహభావం, ఐకమత్యం, సోదరభావం మరింత బలపడింది. ఈ వేడుకలు ఆహ్లాదకరమైన వాతావరణంలో, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలిచాయి.

यह भी पढ़ें