Sunday18 October 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g+0.09%
भाषाएँ

Latest News

సంగీత దర్శకుడు దేవా మృతిపై ఉపరాష్ట్రపతి సంతాపం

nagendra18 October 2026, 2:32 AM0 व्यूtrinetnews.com
సంగీత దర్శకుడు దేవా మృతిపై ఉపరాష్ట్రపతి సంతాపం

Share this story

Share link keeps your language (?lang=)

‘గానా’ పాటలతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారన్న సి.పి. రాధాకృష్ణన్‌

  • న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17:

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా మృతి పట్ల భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తమిళ సినీ, సంగీత రంగాలకు తీరని లోటని సంతాప సందేశంలో పేర్కొన్నారు.

విలక్షణ సంగీత శైలి, ప్రజల జీవితాలు, భావోద్వేగాలను ప్రతిబింబించే ప్రసిద్ధ ‘గానా’ పాటలతో దేవా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారని ఉపరాష్ట్రపతి కొనియాడారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాలకు సంగీతం అందించి భారతీయ సినిమాకు విశేష సేవలందించారని గుర్తుచేశారు.

దేవా అందించిన మధురమైన స్వరాలు, ‘గానా’ సంగీతానికి చేసిన ప్రత్యేక కృషి తరతరాల సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, సంగీతాభిమానులకు ఉపరాష్ట్రపతి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

यह भी पढ़ें